రౌడీ హీరో విజయ్ దేవరకొండ కన్నడ భామ రష్మిక మందన్న ఇద్దరు కలిసి చేసింది రెండు సినిమాలే అందులో ఒక సినిమా హిట్ కాగా.. మరొకటి భారీ అంచనాలతో వచ్చి నిరాశపరచింది. గీతా గోవిందం తో మొదటిసారి కలిసి జోడీ కట్టిన ఈ ఇద్దరు ఆ సినిమాతో హిట్ జోడీ అనిపించుకుంది. ఆ ఇద్దరిలో వీరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆ సినిమా సక్సెస్ తో మళ్లీ ఇద్దరు కలిసి డియర్ కామ్రేడ్ సినిమా కు కలిసి పనిచేశారు.

ఈ రెండు సినిమా లు కలిసి చేసే సరికి ఇద్దరి మధ్య మంచి క్లోజ్ నెస్ పెరిగింది. కేవలన్ ఆన్ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా విజయ్ దేవరకొండ రష్మిక మంచి ఫ్రెండ్స్ గా ఉంటున్నారని తెలుస్తుంది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ రెండు సినిమాల్లో కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక సినిమాల తో సంబంధం లేకుండా వారి ఫ్రెండ్ షిప్ ని కొనసాగిస్తున్నారు. విజయ్ ఎక్కడ ఉంటే అక్కడ రష్మిక ప్రత్యక్షమవుతుంది.  

మొన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో కూడా విజయ్, రష్మిక కలిసి ఎంజాయ్ చేశారు. ఇక ఇప్పుడు జరిగిన సంక్రాంతి వేడుకల్లో కూడా విజయ్ దేవరకొండ తో రష్మిక కలిసి సెలబ్రేట్ చేసినట్టు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు సంక్రాంతి సెలబ్రేషన్స్ తో షేర్ చేసిన ఫోటోల్లో బ్యాక్ గ్రౌండ్ చూసి ఇద్దరు కలిసే పండుగ సెలబ్రేట్ చేసుకున్నారని అర్ధమవుతుంది. ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నట్టు టాక్. అయితే వీళ్ల రిలేషన్ ఫ్రెండ్ షిప్ వరకేనా లేదా నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లే అవకాశం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. విజయ్, రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ కపుల్స్ గా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: