టాలీవుడ్ లో కరోనా విపత్కర పరిస్థితుల వల్ల పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ వంటి పెద్ద సినిమాలు సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడంతో థియేటర్స్ లో కళ తప్పింది. ఈ సంక్రాంతికి అన్ని చిన్న సినిమాలు విడుదలయ్యాయి. అయితే వీటిలో కింగ్ నాగర్జున నటించిన 'బంగార్రాజు' మాత్రమే పెద్ద హీరో సినిమాగా రిలీజ్ అయింది. నాగార్జున, నాగచైతన్య నటించిన బంగార్రాజు తొలి రోజే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన బంగార్రాజు సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ అనిపించుకుంది.

నాగర్జున సినిమా మీద ఉన్న నమ్మకంతో కరోనా సమయంలో కూడా ధైర్యంగా విడుదల చేయడం బంగార్రాజు కి బాగా కలిసి వచ్చింది. సంక్రాంతికి పెద్ద సినిమాలు ఏమీ లేక పోవడంతో సుమారు 800 థియేటర్స్ లో రిలీజ్ అయింది ఈ సినిమా. ఖచ్చితంగా సినిమా కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందని అంతా భావించారు. కానీ బంగార్రాజు మాత్రం వాటన్నిటిని పటాపంచలు చేసి.. మొదటి రెండు రోజుల్లోనే భారీ కలెక్షన్స్ రాబట్టింది. మూడో రోజు కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ భారీగా వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా నాగార్జున కెరీర్లోనే అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగా నిలిచింది.

దాదాపు 39 కోట్ల బిజినెస్ ని లక్ష్యంగా చేసుకొని బరిలోకి దిగిన బంగార్రాజు తొలివారంలోనే ఆ కలెక్షన్లను రాబట్టేలా బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. దీంతో చిత్ర యూనిట్ కూడా ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఫీలవుతోంది. ఇక బంగార్రాజు కి ఇక్కడ మరో కలిసొచ్చే అంశం ఏమిటంటే ఈ సంక్రాంతి తర్వాత ప్రభుత్వం సెలవులు పొడిగించింది. దీంతో ఈ అంశం కూడా బంగార్రాజు కి ప్లస్ అయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సినిమాలో నాగార్జున నాగచైతన్య స్క్రీన్ ప్రెజెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇక అనూప్ సమకూర్చిన బాణీలు కూడా అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక సినిమాలో స్పెషల్ సాంగ్స్ కి కూడా మంచి హైప్ వచ్చింది.మరి సంక్రాంతికి పొడిగించిన సెలవులని బంగార్రాజు ఏ మేరకు క్యాష్ చేసుకుంటాడో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: