ఉ అంటావా.. ఉ ఉ అంటావా అంటూ దేశం మొత్తాన్ని ఉర్రూతలూగించిన సమంత కెరియర్ లో ఫస్ట్ టైం చేసిన స్పెషల్ సాంగ్ తోనే రికార్డ్ సృష్టించింది. పండుగ సందడి ఎక్కడ ఉంటే అక్కడ ఈ సాంగ్ రచ్చ రచ్చ చేసింది. సమంత చేసిన ఈ స్పెషల్ సాంగ్ వల్ల తనతో పాటుగా సినిమాకు ఎంతో ప్లస్ అయ్యింది. పుష్ప సినిమా హిందీ వర్షన్ బిగ్గెస్ట్ హిట్ అవడంతో అక్కడ ఫ్యామిలీ మెన్ 2 లో నటించిన సమంతకు మరింత ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే పుష్ప సాంగ్ రిలీజ్ అవడమే ఆలస్యం ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయట.

ఇక చైతుతో సెపరేషన్ తర్వాత పూర్తిగా సినిమాలు.. కెరియర్ అంటూ తన పూర్తి దృష్టి మార్చేసుకున్న సమంత ఇక మీదట రెచ్చిపోయేందుకు రెడీ అంటుంది. అయితే ఈ సందడిలోనే సమంతకి మరో స్పెషల్ ఐటం సాంగ్ ఆఫర్ దక్కించుకుందని టాక్. ఓ స్టార్ హీరో చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలో సమంతని స్పెషల్ సాంగ్ కోసం అడిగారట. అందుకోసం సమంత భారీ రెమ్యునరేషన్ అడిగినట్టు టాక్.

ప్రస్తుతం సమంత ఓ పక్క గుణశేఖర్ తో శాకుంతలం సినిమాతో చేస్తుండగా మరోపక్క కొత్త దర్శకులు హరి, హర్ష డైరక్షన్ లో చేస్తున్న యశోద సినిమాతో కూడా సత్తా చాటనుంది. వెబ్ సీరీస్ లు.. సినిమాలతో పాటుగా కొత్తగా స్పెషల్ సాంగ్స్ తో కూడా సమంత తన పాపులారిటీని నేషనల్ వైడ్ గా సత్తా చాటనుంది. తప్పకుండా సమంత రాబోయే సినిమాల్లో మరింత గ్లామర్ షో చేసేందుకు రెడీగా ఉందని టాక్. డైవర్స్ తర్వాత సమంత తన సినిమా కెరియర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. వచ్చిన ప్రతి ఛాన్స్ చేస్తూ వెళ్లకుండా తనకు పేరు తెచ్చే వాటినే ఒప్పుకుని చేస్తుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: