టాలీవుడ్ కి వచ్చీరాగానే వరుసగా మూడు హిట్ లను సొంతం చేసుకుంది కృతి శెట్టి. ఇకపోతే ఈ బ్యూటీ తన మొదటి సినిమా అయిన ఉప్పెన  సినిమాతో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సంపాదించింది. అంతేకాకుండా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో కూడా హిట్లను సొంతం చేసుకోగా బంగార్రాజు సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే శుక్రవారంతో  పోలిస్తే శనివారం బాగానే వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక షూటింగ్ విషయానికి వస్తే ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే షూటింగ్ను పూర్తి చేసుకుంది. నాగార్జున ఒకవైపు బిగ్ బాస్ షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ పట్టుదలతో ఈ సినిమాని పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయడం జరిగింది.

అయితే ఈ సినిమా కోసం ఇంకా ఎక్కువ సమయం కేటాయించి ఉంటే గనక ఈ సినిమా రిజల్ట్  మరింత బెటర్ గా ఉండేది అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా కోసం  మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్   రేయింబవళ్లు కష్టపడ్డారు.  అంతేకాకుండా మరోవైపు కృతిశెట్టి మరియు నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాతో పాటు ....సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్ లింగుస్వామి కాంబో మూవీలో నటిస్తున్నారు. ఇకపోతే ఈ ముగ్గురు హీరోలు కూడా ప్రస్తుతం సక్సెస్ లిస్ట్ లో లేరనే చెప్పాలి. ఇక ఈ హీరోలకు కూడా కృతి శెట్టి సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి. ఇకపోతే కృతి శెట్టి తన కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

అందరికీ కథ నచ్చే విధంగా కథలను ఎంచుకుంటున్నారు కృతి శెట్టి.ఇక పూజా హెగ్డే, రష్మిక గోల్డెన్ లెగ్ హీరోయిన్లుగా గుర్తింపును సొంతం చేసుకోగా కృతిశెట్టి కూడా ఆ జాబితాలో చేరింది. లేకపోతే స్టార్ హీరోలు సైతం కృతి శెట్టి కి అవకాశాలు ఇస్తే తన క్రేజ్ మరింత పెరిగిపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే కృతి శెట్టి కి సోషల్ మీడియాలో లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తెలుగులోనే కాకుండా కృతి శెట్టి కి ఇతర భాషల్లో కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి.అయితే ఇంత చిన్న వయస్సులోనే కృతిశెట్టి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: