టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బంగార్రాజు, ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించగా, మరో ముఖ్యమైన పాత్రలో నాగ చైతన్య కూడా ఈ సినిమాలో నటించాడు, ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది, ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదలయ్యింది,  థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని కలెక్షన్ ల వర్షం కురిపిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున స్వయంగా నిర్మించిన ఈ మూవీ రెండో రోజూ రూ. 13 కోట్లు గ్రాస్ రాబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం. 

నిన్న సంక్రాంతి కావ‌డంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు త‌ర‌లివెళ్లి ఈ మూవీ ని చూసారు, ఈ మూవీ  నైజాంలో రూ. 2.41 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.66 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 93 లక్షలు రాబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం. ఇక‌ ఈస్ట్‌లో రూ 88 లక్షలు, వెస్ట్‌లో రూ 49 లక్షలు, గుంటూరులో రూ.61 లక్షల గ్రాస్ రాబ‌ట్టింది. కృష్ణాలో రూ.49 లక్షలు, నెల్లూరులో రూ.32 లక్షలు వ‌సూలు చేసింది. బంగార్రాజుకు వ‌స్తోన్న క‌లెక్ష‌న్లు చూసి ఈ మూవీ చిత్ర బృందం సంబరాలు తేలిపోయారు. రెండు రోజుల రికార్డులు క‌లిపి చూస్తే నైజాంలో రూ. 4.47 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.46 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.20 కోట్లు రాబ‌ట్టింది బంగార్రాజు సినిమా, ఈస్ట్‌లో రూ.1.75 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.39 కోట్లు, గుంటూరులో రూ. 1.79 కోట్ల కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి. కృష్ణాలో రూ.93 లక్షలు, నెల్లూరులో రూ. 86 లక్షల కలెక్షన్లను ఈ సినిమా రాబట్టింది, మొత్తానికి రెండు రోజుల్లో కలిపి బంగార్రాజు సినిమా 36 కోట్లు రాబట్టింది, ఈ మూవీ రాబ‌ట్టిన వ‌సూళ్ల‌కు సంబంధించిన ప్ర‌త్యేక పోస్ట‌ర్‌ను ఆ సినిమా యూనిట్ విడుద‌ల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: