ఒకప్పుడు ఎక్కువగా సినిమాలలో మేనరిజమ్స్.. బాగా పాపులర్ అవుతూ ఉండేవి. ఇక అంతే కాకుండా ఏదైనా సినిమాలు విడుదలయ్యాయి అంటే చాలు ఆ ఊతపదాలు ఎక్కువగా వినిపిస్తూ ఉండేవి.. అలా ఇప్పటివరకు ఎన్నో పాపులర్ అయిన పదాలు ఉన్నవి.. అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు మాత్రం ప్రజలను ఎక్కువగా టచ్ చేయడం లేదు.. కేవలం సినిమా సినిమాకి మధ్య హీరోలు తమ బాడీ లాంగ్వేజ్ ని మారుస్తున్నారు కానీ.. ఆ పాత్రకి తగ్గట్టుగా ఉన్న మేనరిజాన్ని మాత్రం చూపించడం లేదు.. అలా ఎన్నో సంవత్సరాల తర్వాత ప్రస్తుతం పుష్ప సినిమాలోని అలాంటి మేనరిజం కనిపించింది..

ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాలో తన బాడీ లాంగ్వేజ్, మార్చి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ఆయన చెప్పే డైలాగులు ఈమధ్య ఊతపదంగా మారాయి. ఇక అల్లు అర్జున్ భుజం సరిగ్గా పనిచేయలేని క్యారెక్టర్లో.. అదరగొట్టి ,డాన్స్ వేయడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక అంతే కాకుండా ఈ స్టెప్పులను కాపీ చేస్తూ ఎంతోమంది వీడియోలు కూడా చేయడం జరిగింది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా బాగానే రాబట్టింది. ఇక రెండో పార్ట్ ను షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు చిత్రయూనిట్ సభ్యులు. ఫస్ట్ పార్ట్ కంటె సెకండ్ పార్ట్ హైలెట్గా ఉంటుందని చెబుతున్నారు చిత్ర యూనిట్ సభ్యులు .



ప్రస్తుతం ఆ మాటను నిలబెట్టుకునే విధంగా సుకుమార్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సెకండ్ పార్ట్ లో.. బాడీ లాంగ్వేజ్ లోనూ.. తన మేనరిజం లోనూ తన మేనరిజం లోనూ మార్పులు చేసే విధంగా ప్లాన్ చేసినట్లుగా సమాచారం. ఇక రెండో పార్టీలో కూడా అల్లు అర్జున్ ఒకేలా చూపించడం సుకుమార్ కి బోర్ కొడుతుందని ఆలోచన రావడంతో ఇలాంటి మార్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం అల్లు అర్జున్, సుకుమార్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు గా సమాచారం. మళ్లీ ఆ  పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: