కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి, సిద్ధార్థ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన అనగనగా ఓ ధీరుడు సినిమాలో ప్రతినాయక పాత్రలో కనిపించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర లో మంచు లక్ష్మి నటనకు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి, ఆ తర్వాత మంచు లక్ష్మి అనేక సినిమాల్లో నటించి టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
మంచు లక్ష్మి కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాకుండా అనేక టీవీ షో లకు హోస్ట్ గా,  ఓటిటి షో లకు హోస్ట్ గా కూడా వ్యవహరించి మంచి గుర్తింపును తెచ్చుకుంది, మంచు లక్ష్మి వెబ్ సిరీస్ లో కూడా నటించింది, ఇలా సినిమాలతో, టీవీ షోలతో, ఓటిటి షోలతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, ఈ ముద్దుగుమ్మ తన సినిమా షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉండే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు తన అందచందాలు ప్రదర్శితమయ్యేల ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా మంచు లక్ష్మి ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలో మంచు లక్ష్మి వైట్ కలర్ టీ షర్ట్ ను వేసుకొని మెడలో ఒక లాకెట్ ను ధరించి అలా కొంటెగా చూస్తూ ఫోటోకు స్టిల్ ఇచ్చింది, ప్రస్తుతం మంచు లక్ష్మి కి సంబంధించిన ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: