అందాల ముద్దుగుమ్మ మేఘా ఆకాష్, నితిన్ హీరోగా తెరకెక్కిన లై సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటనకు, అందచందాలకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో మేఘ ఆకాష్ కు టాలీవుడ్ లో పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ చల్ మోహన్ రంగా, రాజ రాజ చోర, డియర్ మేఘ వంటి పలు తెలుగు సినిమాలలోనటించి టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది.

 ఇలా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న రావణాసుర సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది, ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది, తన సినిమా షూటింగ్ అప్డేట్ లను, ఇతర విషయాలను కూడా మేఘ ఆకాష్ తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పెంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన అందచందాలు ప్రదర్శితమయ్యేల ఉన్న ఫోటోలను కూడా మేఘ ఆకాష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో మేఘ ఆకాష్ అదిరిపోయే లుక్ లో శారీ కట్టుకొని, స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం మేఘ ఆకాష్ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: