ఇక నిఖిల్ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయన హైదరాబాదులో బేగంపేటలో 1985 జూన్ 1వ తేదీన పుట్టారు. నిఖిల్ విద్యాభ్యాసం అక్కడే పబ్లిక్ స్కూల్ లో పూర్తి చేశాడు. ఆయన మొదట హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశాడు. ఆ తరువాత నిఖిల్ కి నటన మీద ఆసక్తి పెరగడంతో ఎన్. జె.భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీలో నలుగురు స్నేహితుల పాత్రలో హీరో నిఖిల్ కూడా నటించిన విషయం తెల్సిందే.
హ్యాపీడేస్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో నిఖిల్ నటనకు కూడా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తరువాత నిఖిల్ కళావర్ కింగ్, యువత, వీడు తేడా వంటి మరికొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అంతగా ఆశించిన ఫలితం అందుకోలేకపోయాడు. ఇక అదే సమయంలో డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం స్వామిరారా.. ఈ సినిమా నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోయింది. ఈ చిత్రం తరువాత నిఖిల్ వెనక్కి తిరిగి చూడలేదు.
అందరికి తెలియని ఇంకో విషయం ఏంటంటే.. నిఖిల్ కెరియర్ మొదట్లో ఒక సీరియల్లో నటించారు. ఇంతకీ ఆ సీరియల్ ఏంటి అని అనుకుంటున్నారా.. అప్పట్లో ఈటీవీలో ప్రసారమైన చదరంగం సీరియల్. ఈ ధారావాహికలో రాజీవ్ కనకాల,తనికెళ్ల భరణి కూడా నటించారు. ఇక ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ సినిమాకి సీక్వెల్ గానటిస్తున్నారు. అంతేకాదు.. 18- పేజీస్ అనే మరొక సినిమాలో కూడా నటిస్తున్నారు.