కింగ్ నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్య కలిసి నటించిన లేటెస్ట్ సినిమా బంగార్రాజు. యువ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంస్థలు ఎంతో భారీగా నిర్మించగా నాగ్ ఇందులో రెండు పాత్రలు చేసారు. కొన్నేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన సోగ్గాడే చిన్ని నాయన మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన బంగార్రాజు మూవీ, మొదటి భాగాన్ని మించేలా మరింత అద్భుతమైన టాక్ ని అలానే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ప్రస్తుతం అన్ని ఏరియాల్లో దూసుకెళుతోంది.

ఆకట్టుకునే కథ, కథనాలతో అక్కినేని ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తీసిన బంగార్రాజు మూవీ పెద్ద విజయాన్ని అందుకోవడంతో టీమ్ అమితానందాన్ని వ్యక్తం చేస్తూ నిన్న సక్సెస్ సంబరాలు జరిపింది. కృతి శెట్టి, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు చేసిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, నాగబాబు, రావు రమేష్, సంపత్ తదితరులు ఇతర పాత్రలు చేసారు. ఇక తొలి ఆట నుండే ఆడియన్స్ మనసు దోచుకుంటూ దూసుకెళ్తున్న బంగార్రాజు మూడు రోజుల్లోనే ఏకంగా రూ. 55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

మరోవైపు ఈ సినిమాకి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏరియాల్లో థియేటర్స్ ని పెంచినప్పటికీ కూడా ఈరోజు చాలావరకు కలెక్షన్స్ బాగా వచ్చాయని, దీనిని బట్టి చూస్తుంటే రాబోయే మరికొద్ది రోజుల్లోనే బంగార్రాజు పెట్టుబడినంతా రాబట్టి, దాదాపుగా అనేక ప్రాంతాల్లోని బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు తెచ్చిపెట్టడం ఖాయం అని అంటున్నారు. ఇక ఈ సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు, అలానే నాగ చైతన్య కనిపించిన చిన బంగార్రాజు పాత్రలకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతుండగా సినిమాకి అనూప్ రూబెన్స్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి మరింతగా పేరు లభిస్తోంది. మరి రాబోయే రోజుల్లో బంగార్రాజు ఎంత మేర బాక్సాఫీస్ దండయాత్ర చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: