సినిమాకు ఇంకా 11.5 కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉందని తెలుస్తోంది.మొదట్నుంచి ఈ సినిమాకు పెద్ద హైప్ లేకపోయినా ప్రీ రిలీజ్ ఫంక్షన్ తో కొంత హైప్ తీసుకువచ్చాడు దిల్ రాజు.దేవీ శ్రీ సంగీతం పెద్దగా వినిపించకపోయినా సినిమా విషయంలో రాజమౌళి లాంటి వారు కాస్త సపోర్టుగానే నిలిచారు.ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా పెద్దగా లేవు. అసలు ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని అనుకోకపోయినా సడెన్ గా థియేటర్ల ముందుకు వచ్చేసింది.మొదటి రోజు కలెక్షన్ డాటా ప్రకారం 90లక్షల రూపాయల షేర్ ను అందుకుంది అనితెలుస్తోంది.రెండో రోజు షేర్ : కోటి రూపాయల దాకా ఉందని టాక్. ఎలా చూసుకున్నా ఈ సినిమా దిల్ రాజుకు లాభాలు తెచ్చేదే కాదు.కానీ తన ఇంటి నుంచి కూడా హీరో మెటీరియల్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు దిల్ రాజు.ఒకవేళ ఆశీష్ హిట్ కొడితే ఇక తనకు తిరుగుండదని ఆయన ధీమా! అయితే ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలలో వెంకటేశ్ అంతటి హిట్ ఎవ్వరూ కొట్టలేకపోయారు.
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సారథి ఎంఎస్ రాజ్ కొడుకు కూడా పెద్దగా హిట్లు కొట్టలేకపోయారు. అదేవిధంగా చాలా మంది ప్రముఖ నిర్మాతల పిల్లలు పెద్దగా రాణించలేకపోయారు. కానీ వీటికి భిన్నంగా ఈ సినిమా కాకపోయినా వచ్చే సినిమాకు అయినా మనోడు సెట్ కాకపోతాడా అన్న ధీమాతో దిల్ రాజు తనకు ఎంతో కలిసివచ్చిన సుకుమార్ ను రంగంలోకి దింపాడు. ఆయనతో ఓ సినిమా చేసేందుకు సై అంటున్నాడు. ఆశిష్ హీరోగా సుక్కూ రైటింగ్స్ లో ఓ సినిమా రానుంది.ఈ సినిమా టైటిల్ సెల్ఫిష్ అని నిర్ణయించారు.కాశీ అనే కొత్త కుర్రాడిని ఈ సినిమాకు డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేయనున్నారు. ఈయన కూడా సుక్కూ స్టూడెంటే! ఇప్పటిదాకా సుక్కూ శిష్యులంతా బాగానే హిట్లు కొట్టారు.ఆ కోవలో కొత్త సినిమా అయినా ఈ కుర్ర హీరోకు కలిసి వస్తుందని ఆశించడంలో తప్పేం లేదు కానీ కొత్త ప్రయత్నాలకు ఆనవాలుగా నిలిస్తే మేలు.