ఈ వారం ప్రేక్షకులను ఆలరించబోయే ఓటిటీ విడుదల అయ్యే సినిమా లు భారీగానే ఉన్నాయని చెప్పవచ్చు. సంక్రాంతి సందర్భంగా కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతగానో ప్రేక్షకులను అలారించగా సంక్రాంతి తర్వాత కూడా అదే రేంజ్ లో క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అలాంటి వాటిలో ఓ సినిమా అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందిరికి తెలిసిందే. బాలకృష్ణ కెరీర్లోనే భారీ వసూళ్లు సాధించిన సినిమాగా ఇది నిలిచిపోయింది అని చెప్పవచ్చు.

బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు మరొకసారి పరిచయం చేసిన ఈ సినిమా సరైన టైంలో విడుదలయ్యి భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. అంతేకాదు తెలుగు సినిమా పరిశ్రమకు ఒక ఊపిరి తీసుకువచ్చిన సినిమాగా అఖండ సినిమాను అప్పట్లో అభివర్ణించారు. అలాంటి ఈ సినిమా సంక్రాంతికి ఓటీటి లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరు భావించగా ఈ సినిమా అప్పుడు రాకపోవడం ఒక్కసారిగా అందరినీ తీవ్రమైన నిరాశ లోకి ముంచింది. దాని తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్ద సినిమాలు అన్నీ కూడా ఓ టీ టీ లో వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా ఇంకా రాకపోవడంపై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు.

తాజాగా ఈ సినిమాను జనవరి 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. హాట్ స్టార్ లో ఇది విడుదల అవుతుంది. దీని పట్ల బాలకృష్ణ అభిమానులు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అలాగే మలయాళంలో సూపర్ హిట్ అయిన డాడీ బ్రో చిత్రాన్ని కూడా జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ విధంగా ఈ నెలలో వచ్చే రెండు వారాల్లో రెండు సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం పట్ల అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను చూసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి ఈ సినిమా లు ఏ స్థాయిలో రేటింగ్ ను అందుకుంటాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

ott