అంతకుముందు సపోర్టింగ్ రోల్స్ చేసి కొద్దిగా గ్యాప్ ఇచ్చి సడెన్ గా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాంటి టిపికల్ సబ్జెక్ట్ తో హీరోగా సర్ ప్రైజ్ చేశాడు నవీన్ పొలిశెట్టి. ఆ సినిమా ఏదో అలా లక్కీగా హిట్ అయ్యిందిలే అనుకోగా ఆ తర్వాత వచ్చిన జాతిరత్నాలు అంతకుమించి హిట్ అయ్యింది. యువ హీరోలోని టాలెంట్ గుర్తించిన ఆడియెన్స్ కుర్రాడు సూపర్ అనేసుకున్నారు. ఇక లేటెస్ట్ గా అతను హీరోగా ఒకేసారి రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. అందులో ఒకటి యువి క్రియేషన్స్ వారి మూవీ కాగా.. మరొకటి సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మూవీ.

సితార బ్యానర్ సినిమా మొన్న ఎనౌన్స్ మెంట్ చేశారో లేదో సంక్రాంతి సందర్భంగా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు. కళ్యాణ్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టైటిల్ గా అనగనగా ఒక రాజు అని ఫిక్స్ చేశారు. తన పెళ్లి ఓ రేంజ్ లో జరగాలని హడావిడి చేస్తూ నవీన్ పొలిశెట్టి రిలీజ్ చేసిన వీడియో కూడా అదిరిపోయింది. సినిమాపై ఎంతగా బజ్ ఉంది అన్నది ఈ టీజర్ వ్యూస్ ని బట్టే చెప్పొచ్చు. అతనో స్టార్ కాకపోయినా సరే అనగనగా ఒక రాజు టీజర్ కు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. 24 గంటల్లో ఈ టీజర్ 3 మిలియన్ వ్యూస్ రాబట్టింది.

అంతేకాదు యూట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ 1 గా నిలిచింది. నవీన్ సినిమాకు ఈ రేంజ్ లో రెస్పాన్స్ ప్రాజెక్ట్ పై మరింత క్రేజ్ వచ్చేలా చేసింది. టీజర్ కు వచ్చిన ఈ రెస్పాన్స్ కి చిత్రయూనిట్ కూడా ఫుల్ ఖుషి అవుతుంది. చూస్తుంటే నవీన్ పొలిశెట్టి ఈ సినిమాతో కూడా తన ఖాతాలో మరో సెన్సేషనల్ హిట్ వేసుకునేలా ఉన్నాడు. ఈ సినిమాకు సంబందించిన మిగతా హీరోయిన్ కాస్ట్ క్రూ గురించి విషయాలు త్వరలో తెలియచేస్తారని తెలుస్తుంది.





మరింత సమాచారం తెలుసుకోండి: