సంక్రాంతి పండుగ మ‌రికొద్ది సేప‌ట్లో ముగియ‌నుంది.భోగితోమొద‌లై ముక్క‌నుమతో ముగిసే ఈ పండుగ ఈ సారి ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు మోసుకువ‌చ్చింది.ఊళ్ల‌లో ఇంకా పండుగ సంద‌డి కొన‌సాగే అవ‌కాశాలు ఉన్నాయి.ఎందుకంటే సోమ‌వారంతో పెద్ద‌గా ఎవ్వ‌రూ తిరుగు ప్ర‌యాణాలు అవ్వ‌రు.పోనీ మంగ‌ళ‌వారం అంటే అది కూడా ఈ బాప‌తే!క‌నుక బుధ‌వారమే ఇళ్ల‌కు చేరుకునేందుకు స‌రైన స‌మ‌యం అని భావిస్తారు.ఈ లెక్క‌న చూసుకుంటే శుక్ర‌వారం మొద‌ల‌యిన పండుగ మ‌ళ్లీ శుక్ర‌వారం వ‌ర‌కూ ఉండ‌డం ఖాయం.


బుధ‌వారం ఇళ్ల‌కు చేరుకున్నా కొన్ని ఊళ్ల‌లో తీర్థాలు ఉంటాయి..కొన్ని ఊళ్ల‌లో జాత‌ర‌లు ఉంటాయి. కొన్ని ఊళ్ల‌లో అమ్మ‌వారికి నైవేద్య స‌మ‌ర్ప‌ణ‌లు ఉంటాయి. కొన్ని ఊళ్ల‌లో అర‌టి గెల‌లు అమ్మ‌వారికి స‌మ‌ర్పించి పూజించే సంస్కృతి ఉంటుంది. ఎలా చూసుకున్నా మ‌రో శుక్ర‌వారం సంక్రాంతి కోస‌మే అన్న‌ది త‌థ్యం.ఈ లెక్క‌న సినిమా సంక్రాంతి కూడా అప్పుడే ముగిసిపోదు కూడా!

ఇక సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లయిన సినిమాల జాబితాలో సోగ్గాడు సీక్వెల్ బంగార్రాజు, మ‌హేశ్ బాబు అల్లుడు న‌టించిన హీరో, దిల్ రాజు కొడుకు న‌టించిన రౌడీ బోయ్స్ ఉన్నాయి.వాస్త‌వానికి జ‌న‌వ‌రి 7న విడుద‌ల కావాల్సిన ఆర్ఆర్ఆర్ సినిమా అనుకున్న స‌మ‌యానికి రాలేదు.క‌రోనా ఉద్ధృతి దృష్ట్యా నార్త్ లో చాలా న‌గ‌రాల్లో థియేటర్లు పూర్తి స్థాయిలో మూత‌ప‌డ‌డం వ‌ల్ల ఈ సినిమా వాయిదా అన్న‌ది త‌ప్ప‌నిస‌రి అయింద‌ని నిర్మాణ వ‌ర్గాలు చెప్పుకువ‌చ్చాయి.రాజ‌మౌళి కూడా ఈ సినిమా ఆర్థిక భారాన్ని మోసేందుకు ముందుకు వ‌చ్చి రెండు వంద‌ల కోట్లకు త‌న‌వంతు షూరిటీ ఇచ్చేశాడు.


ఇక ఆచార్య సంగ‌తి కూడా ఇదేవిధంగాఉంది. చేసేదేమీ లేక ఆర్థిక భారం మోసేందుకు కొర‌టాల శివముందుకు వ‌చ్చి నిర్మాత‌కు అండ‌గా నిలిచాడు.ఆచార్య విడుద‌ల ఏప్రిల్ 1 అని క‌న్ఫం అయింది.భీమ్లా నాయ‌క్ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. ఫిబ్ర‌వ‌రి 25న రానుంది.మొత్తంగా ఈ మూడు సినిమాల రిలీజ్ పై ఓ క్లారిఫికేష‌న్ ఉంది. అదేవిధంగా మ‌హేశ్ స‌ర్కారు వారి పాట కూడా రిలీజ్ కు సిద్ధం అయి ఉంది.

వీటితో పాటు వెంకీ, వ‌రుణ్ తేజ్ సంద‌డి చేయ‌నున్న ఎఫ్ 3 కూడా వేస‌వికి రానుంది. ఇన్ని సినిమాలు విడుద‌ల వాయిదా అయినా కూడా నాగ్ మాత్రం త‌నదైన ప‌ట్టుద‌ల‌తో బంగార్రాజు సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చి థియేట‌ర్ల‌లో పండ‌గ సంద‌డి నింపాడు.అయితే ఈ సినిమా యావ‌రేజ్ టాక్ తోనే న‌డుస్తోంది.సంక్రాంతి రేసులో ఉన్న మిగ‌తా రెండు చిత్రాల క‌న్నా కాస్త బెట‌ర్ గా ఉండ‌డంతో క‌లెక్ష‌న్ల ప‌రంగా మంచి క్రేజ్ ఉంద‌ని తెలుస్తోంది.ఆ విధంగా సంక్రాంతి రారాజు బంగార్రాజే!

నో డౌట్ ఇన్ ఇట్ !



మరింత సమాచారం తెలుసుకోండి: