వెండితెరపై గుంటూరు టాకీస్ సినిమాలో గ్లామర్ తో అందరికీ మత్తెక్కించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు చిరంజీవి హీరోగా నటిస్తున్న 'భోళాశంకర్' సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించేందుకు సిద్దమయిందన్న వార్తలు గురించి తెలిసిందే. అయితే ఇపుడు ఈ ఇద్దరు హాట్ యాంకర్ల గురించి ఒక లేటెస్ట్ న్యూస్ అందరికి షాక్ ఇచ్చింది. ఈ ఇద్దరు అందగత్తెలు కలిసి ఒకే సారి కెమెరా ముందుకు రావడం చాలా రేర్ అనే చెప్పాలి. అలాంటిది వీరిద్దరూ కలిసి ఇపుడు మెగాస్టార్ సినిమాలో నటించనున్నారు అని తెలుస్తోంది. చిరంజీవి నటిస్తున్న నూతన చిత్రం 'భోళా శంకర్' లో వీరిద్దరూ గెస్ట్ రోల్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇంత పెద్ద న్యూస్ వినిపిస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా...ఇక రేపు అంతా ఇదే అంశం ఫోకస్ టాపిక్ గా మారే అవకాశం ఉన్నది. అయితే ఈ సినిమాలో రష్మీ మరియు అనసూయ లు ఎటువంటి పాత్రలలో కనిపించి తమ అభిమానులను అలరించనున్నారు అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.