బంగార్రాజు మూవీ ప్రస్తుతం మాత్రం కలెక్షన్ల పండగను తెచ్చింది. సంక్రాంతికి అయితే ఈ సినిమా బాగా వర్కౌట్ అయ్యింది. సంక్రాంతికి సాధించేశాడుగా బంగార్రాజు. వాసివాడి తస్సాదియ్య అంటూ అభిమానులు కాలర్ అయితే బాగా ఎగరేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా 14న రిలీజ్ అయిన సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ తో తన సత్తా ఏంటో చూపించింది. ఒక్కరోజే రూ. 17 కోట్లు వసూల్ చేసి వారేవ్వా బంగార్రాజు అనిపించిందీ ఈ సినిమా 

సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'బంగార్రాజు'మూవీ తాజాగా రూ.53 కోట్లకు పైగా కలెక్షన్ల వర్షం కురిపించిందని తెలుస్తుంది.. కేవలం మూడు రోజుల్లో ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్స్ రావడంతో చిత్ర నిర్మాతలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి కలెక్షన్ కింగ్ లా బంగార్రాజు ఉండటం పట్ల వారు సంతోషపడుతున్నారు.

అయితే పండుగ సందర్భంగా రిలీజైన బంగార్రాజు మూవీ కలెక్షన్ల మోత మోగిస్తుండటం పట్ల అఖిల్ తన తండ్రి నాగార్జున మరియు అన్న నాగ చైతన్యకు శుభాకాంక్షలు తెలుపుతూ కూడా ట్వీట్ చేశాడు. అఖిల్. 'ఒక కొడుకుగా, ఒక తమ్ముడిగా చాలా గర్వ పడుతున్నాను అని సంక్రాంతి పండుగ మీదే అని బంగార్రాజు మూవీ టీమ్ కు నా శుభాకాంక్షలు అని మళ్లీ బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చినందుకు మా డైరెక్టర్ కే కళ్యాణ్ క్రిష్ణకు ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశాడట  


టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) గతంలో చేసిన సొగ్గాడే చిన్నినాయనా సినిమా.. ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. అదే తరహాలో బంగార్రాజు సినిమాను కూడా తెరకెక్కించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన కే కళ్యాణ్ క్రిష్ణ తన ప్రతిభతో మూడు నుంచి నాలుగు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు.

పెద్ద సినిమాలన్నీ సంక్రాంతి బరిలో నిలుస్తాయనుకుంటే ఒక్కొక్కటి తప్పుకోవడంతో బంగర్రాజు మూవీకి బాగా ప్లస్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా డైరెక్టర్ కళ్యాణ్ క్రిష్ణ చిత్రీకరించడంతో సంక్రాంతి పండుగ మొత్తం థియేటర్లలోనే కనిపించిందట.అక్కినేని ఫ్యామిలీకి డైరెక్టర్ కళ్యాణ్ గతంలో సోగ్గాడే చిన్ని నాయన సినిమా తీసి పెద్ద హిట్ అందించారని అందరికి తెలుసు..

కాగా, అఖిల్ అక్కినేని రీసెంట్ మూవీ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తో హిట్ కొట్టి తన కళను సాకారం చేసుకున్నాడట.. గతంలో తీసిన నాలుగు సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో కొంత నిరాశ చెందిన అఖిల్ మరియు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో తన కేరీర్ ను పట్టాలపైకి ఎక్కించాడు. ఈ సంక్రాంతితో అక్కినేని వారింట సినిమాల పంట అన్నట్టుగా ఉందని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: