రెండున్నర గంటల సినిమా ప్రేక్షకులకు నచ్చేలా చేయడం అంటే కేవలం కథ, కథనం, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు మ్యూజిక్ డైరక్టర్స్ అందించే సంగీతం కూడా. సినిమాకు ఐదారు పాటలు అన్న ఫార్మెట్ మారి సందర్భం వచ్చినప్పుడే పాట అన్న కాన్సెప్ట్ ఇప్పుడు నడుస్తుంది. అంతేకాదు ఈమధ్య సినిమాలకు పాటలే కాదు బ్యాక్ గ్రౌడ్ స్కోర్ కూడా చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. ఎంచుకున్న కథకి తగినట్టుగా పాటలు ఉన్నా లేకపోయినా సరే బిజిఎం మాత్రం బాక్సులు బద్ధలవ్వాల్సిందే.

ఈమధ్య దర్శకులు, మ్యూజిక్ డైరక్టర్స్ కలిసి సినిమా బిజిఎం మీద ఎక్కువ వర్క్ అవుట్ చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో అఖండ బిజిఎం అదిరిపోయింది. అఖండ చూసిన వారు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెచ్చుకోకుండా ఉండరు. పుష్ప సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బిజిఎం కూడా బీభత్సం సృష్టించింది. పుష్ప లాంటి రా అండ్ రియలిస్ట్ కథకు దేవి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

ఇదే ఉత్సాహంతో నాని నటించిన శ్యాం సింగ రాయ్ కు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అరుపులు పెట్టించాడు. మిక్కీ జే మేయర్ లో ఇంత టాలెంట్ ఉందా అని అనుకునేలా శ్యాం సింగ రాయ్ మ్యూజిక్ ఇచ్చాడు. వీటితో పాటుగా సంక్రాంతికి వచ్చిన బంగార్రాజు సినిమాకు అనూప్ రూబెన్స్ కూడా సాంగ్స్ తో పాటుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా తన సత్తా చాటాడు. స్టోరీ, స్క్రీన్ ప్లేలో దమ్ము ఉంటే దాని ఫోర్స్ మరింత పెంచేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే బిజిఎం మ్యాటర్ అదిరిపోతుందో ఆ సినిమా పక్కా సెన్సేషన్ అవుతుంది. అందరికన్నా ఈమధ్య టాలీవుడ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటే అందరు థమన్ పేరు చెప్పుకుంటున్నారు. అందుకే భారీ బడ్జెట్ తో వస్తున్న రాధే శ్యాం సినిమాకు థమన్ బిజిఎం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: