పుష్ప సినిమాతో బాలీవుడ్ లో డైరక్టర్ సుకుమార్ కి మంచి మైలేజ్ పెరిగింది. పుష్ప పార్ట్ 1 దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన తీరుని చూసి సుక్కు ముందు సినిమాల మీద ఓ కన్నేశారు బాలీవుడ్ ఆడియెన్స్. సుకుమార్ కెరియర్ లో పుష్పకి ముందు బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా రంగస్థలం. రాం చరణ్ కెరియర్ లో కూడా అది బిగ్గెస్ట్ బ్లక్ బస్టర్ మూవీ అయ్యింది. అప్పటివరకు ఉన్న నాన్ బాహుబలి రికార్డులను చిట్టిబాబు బ్రేక్ చేశాడు. పుష్ప సినిమా హిందీ వర్షన్ అదిరిపోయే హిట్ అవడంతో సుకుమార్, రాం చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమాపై ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పుడు ఆ రంగస్థలం సినిమాని హిందీలో డబ్ చేసి థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. పుష్ప తరహాలోనే రంగస్థలం కూడా పీరియాడికల్ ఊర మాస్ డ్రామాగా వచ్చింది. ఆ సినిమాలో చరణ్ చిట్టిబాబు పాత్రలో చితక్కొట్టేశాడు. అందుకే ఆ సినిమా ఇప్పుడు హిందీలో డబ్ చేసి థియేటర్ లలో ఆడించాలని నిర్ణయించారు. ఓ రకంగా ఇది చరణ్ కి కలిసి వచ్చే అంశమే అని చెప్పాలి. ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ముందు రంగస్థలం హిందీ వర్షన్ అక్కడ రిలీజై మంచి క్రేజ్ తెచ్చే అవకాశం ఉంటుంది.

రంగస్థలం మాత్రమే కాదు పుష్ప పార్ట్ 1 ది రైజ్ తో బన్నీకి బాలీవుడ్ లో బీభత్సమైన క్రేజ్ రాగా దాన్ని క్యాష్ చేసుకునేందుకు లాస్ట్ ఇయర్ బన్నీ బ్లాక్ బస్టర్ మూవీ అల వైకుంఠపురములో సినిమాని కూడా హిందీ వర్షన్ థియేటర్ లలో రిలీజ్ చేస్తున్నారట. ఆ సినిమాతో కూడా అల్లు అర్జున్ తప్పకుండా మరోసారి హిందీ ఆడియెన్స్ ని అలరిస్తాడని చెప్పొచ్చు. బాలీవుడ్ హీరోలు కూడా ముక్కున వేలేసుకునేలా పుష్ప 80 కోట్ల దాకా వసూళ్లను రాబట్టి బాలీవుడ్ బాక్సాఫీస్ పై బన్నీ బీభత్సం సృష్టించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: