కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ వాటిని లెక్కచేయకుండా తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి కోడి పందాలలో కేవలం మూడు రోజులలో 1000 కోట్లు చేతులు మారాయి అని వస్తున్న వార్తలను బట్టి జనం సంక్రాంతిని ఏవిధంగా ఎంజాయ్ చేసారో అర్థం అవుతుంది.


ఆంధ్రప్రదేశ్ లోని ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణ జిల్లాలో కోడిపందాల బరులు మామూలుగా కాకుండా కార్పోరేట్ స్థాయిలో కనిపించాయి. తెలుగు రాష్ట్రాలలోని వివిధరకాల పిండివంటలు మందు ఎంజాయ్ చేస్తూ జరిగిన ఈ కోడి పందాలు జరిగిన గ్రౌండ్స్ లో ఎక్కడ చూసినా ‘ఆర్ ఆర్ ఆర్’ ‘భీమ్లా నాయక్’ సినిమాలలోని పాటలు విపరీతంగా సందడి చేయడంతో పాటు సంక్రాంతి సంబరాలు జరిగే ఊళ్ళల్లో ఏర్పాటు చేసిన వేదికల పై ‘ఆర్ ఆర్ ఆర్’ ‘భీమ్లా నాయక్’ పాటలకు యూత్ పూనకం వచ్చినట్లుగా స్టెప్స్ వేయడం చూసిన వారు ఈసారి సంక్రాంతి వేడుకలలో బాబాయి అబ్బాయి లు అయిన పవన్ రామ్ చరణ్ లదే హవా అంటూ కామెంట్స్ చేసుకున్నట్లు టాక్.


మరీ ముఖ్యంగా ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలోని ‘నాటునాటు’ పాట సంక్రాంతి కోడిపందాల మధ్య బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా మారడం చూసినవారికి ఈమూవీ పై తెలుగురాష్ట్రాలలో ఉన్న మ్యానియా అర్థం అవుతుంది. ఎప్పటి నుంచో కోస్తా జిల్లాలలోని యూత్ పవన్ చరణ్ లు కలిసి ఒక మల్టీ స్టారర్ లో నటిస్తే చూసి ఎంజాయ్ చేయాలని కలలు కంటున్నారు.  


ఇప్పుడు సంక్రాంతి సంబరాలలో కొనసాగిన బాబాయి అబ్బాయి హవా ను చూసిన వారు వీరిద్దరూ కలిసి నటిస్తే ఇండస్ట్రీ రికార్డులు తిరిగి రాయడం ఖాయం అని అంటున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ ను సెట్ చేయగల దర్శక నిర్మాతలు ఎవరు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న అనుకోవాలి. ఏది ఎలా ఉన్నా వీరిద్దరి కలయికతో ఒక సినిమా వస్తుందని ఆశిద్దాం..




మరింత సమాచారం తెలుసుకోండి: