మౌన శిల‌ల చెంత య‌థార్థ గాథ..ధ‌నుష్ మ‌రియు ఐష్ ల వైవాహిక బంధం వివాహ జీవితం అని కూడా రాయాలి.

దేవుడు ఏం చేస్తాడు స‌ర్
రెండు బొమ్మ‌ల‌కు రెండు జ‌న్మ‌ల‌కు
బంధం పెట్టి పంపి ఉంటాడు
పై వాడు వేసిన ముళ్లే ఇవి అని అంటారా
విని న‌వ్వుకోవాలి.. పూలు కావు ముళ్లు అని ఎందుకు అన్నారా అని
ఆరా తీస్తే రాత్రి చెంత విషాదం జీవితేచ్ఛ పోయి నిరాశ మిగిలి ఉంటాయి
నాలో మీలో మ‌న‌లో.. ధ‌నుష్ అనే ఓ జాతీయ స్థాయి న‌టుడు
ఆయ‌న జీవ‌న స‌హ‌చ‌రి ఐశ్వ‌ర్య (ప్ర‌తిభావ‌ని) ఇప్పుడు రెండు దారులు
రాత్రి చెప్పిన నిజం రాత్రి ప‌లికిన అబ‌ద్ధం కాని నిజం అసంద‌ర్భం అయితే మేలు
అనిశ్చితి తొల‌గిపోతే మేలు.. అస‌త్యం అయి ఉంటే ఇంకా మేలు


ఇదిగో దేవుడు చేసిన బొమ్మ‌లు..అని అంటారు..ఓ క‌వి..మ‌నుషులను చూసి బొమ్మ‌లు అని అనుకోకండి.మ‌నుషులే దైవం లీల‌లో బొమ్మ‌లు.మ‌నుషులే దేవుడు దిద్దిన రేఖ‌లు..దేవుడే దిద్దిన రంగులు మ‌రియు రూపాలు కూడా! దేవుడు దిద్దాక ఇంకా జీవితంలో దిద్దుబాటు ఏమ‌యినా ఉంటుందా? ఉండ‌దు గాక ఉండ‌దు కానీ జీవితాన విషాదం తొంగి చూస్తుంది. జీవితాన బాధ ఉంటుంది.జీవితం ఒక నిశ్చ‌ల చిత్రం అయి ఉండి ఉంటుంది.అప్పుడు నిరాశ వెన్నాడి ఓ చోట నిలువ‌రిస్తుంది. జీవితం కాంతిమ‌యం కావ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని ఆ వేళ‌లో!


ధ‌నుష్ - ఐష్ అర్ధ‌రాత్రి వేళ విడిపోయారా? లేదా అంత‌కుముందు నుంచి ఉన్న విభేదాలకు నిన్న‌టి రాత్రి ఓ విషాద నేప‌థ్యం అయి ఉందా? ప్ర‌శ్న‌లు ఏమ‌యినా ఇద్ద‌రు క‌లిసి ఉండ‌డం క‌న్నా ఇద్ద‌రు విడిపోవ‌డంలో అత్యంత సౌక‌ర్యం ఒక‌టి ఎవ‌రికి వారు వెతుక్కున్నారు అన్న నింద ఒక‌టి ఆ ఇద్ద‌రూ మోయాల్సిందే. క‌లిసి ఉండడమే స్వేచ్ఛ..విడిపోవ‌డం కాదు అన్న ఓ గ్ర‌హింపు మ‌నుషుల్లో ఉంటే ఎంత బాగుంటుందో! దేవుడు! చేసిన పెళ్లిళ్ల‌లో ముహూర్తాలు అదేవిధంగా అగ్ని హోత్రం సాక్షిగా చేసే ప్ర‌మాణాలు ఇవ‌న్నీ మ‌నుషుల‌ను క‌లిపి ఉంచేందుకు స‌హ‌క‌రిస్తాయి.సంస్కృతి అంటే విడిపోవ‌డం కాదు క‌లిసి ఉండ‌డం అన్న ఓ గొప్ప నేర్పు మ‌నిషికి అల‌వ‌ర్చుతాయి. ఆ అల‌వాటు కార‌ణంగానే విభేదాలు ఉన్నా స్ప‌ర్థ‌లు ఉన్నా జంట‌లు క‌లిసే ఉంటాయి.సంస్కృతికీ, కోర్టుకీ ఉన్న తేడా ఏంటి అంటే.. కోర్టు ఉద్వేగాల‌ను ప‌ట్టించుకోదు..కొన్నిసార్లు.. కానీ సంస్కృతి ఉద్వేగాలే ప్ర‌ధానంగా చేసుకుని జీవితాలు క‌లిసి ఉండేందుకు త‌న‌వంతు స‌హ‌కారం అందిస్తుంది. క‌నుక సంస్కృతి గెలిస్తే చాలు కోర్టులో ధ‌నుష్ - ఐష్ కేసు గెలిచినా గెల‌వ‌కున్నా?

- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి



మరింత సమాచారం తెలుసుకోండి: