అక్కినేని నాగార్జున హీరోగా చేసిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. అయితే ఆ సినిమాకి సీక్వెల్ గా 'బంగార్రాజు' మూవీ రాగా ఆ సినిమా కూడా బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటోంది. ఈ సినిమాలో నాగ చైతన్య పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉందని టాక్, మునుపెన్నడూ లేని విధంగా కొత్త చై ని ఈ చిత్రంలో చూస్తారని అంతా అంటున్నారు. సంక్రాంతి రేస్ లోకి దూసుకొచ్చిన ఈ చిత్రం ఇపుడు యమ స్పీడ్ లో వసూళ్లను రాబడుతోంది, రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ సినిమాలో తండ్రికొడుకులు చైతు, నాగ్ ల కాంబినేషన్ వేరే లెవల్ లో ఉంది.

బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల తో దుమ్ములేపుతున్న ఈ సినిమాకి సక్సెస్ మీట్ పెట్టాలని ఫిక్స్ అయ్యింది బంగార్రాజు మూవీ టీం. కాగా ఈ సక్సెస్ మీట్ ను అన్నపూర్ణ స్టూడియోలో ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించి గ్రాండ్ గా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పండుగ కానుకగా సంక్రాంతి  జనవరి 14వ తేదీన బంగార్రాజు చిత్రం విడుదలైన విషయం విదితమే. పెద్ద అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌ తో దూసుకుపోతుంది. మరో వైపు వసూళ్లను పెంచుకొంటూ తన సత్తా చాటుతోంది.

బంగార్రాజు మూవీ కేవలం మూడే మూడు రోజుల్లో అక్కినేని నాగార్జున కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా ప్రత్యేక ఘనతను సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. సంక్రాంతి కానుకగా ఇంతకు ముందు రావాలని అనుకున్న సినిమాలు వాయిదా పడడంతో పోటీ తగ్గి కలెక్షన్ లు అన్నీ బంగార్రాజు మూవీకే వస్తున్నాయి. కాగా ఈ సక్సెస్ మీట్ లో మరింత స్పెషల్ గా నిలిచేందుకు కృతి సెట్టి ఒక స్పెషల్ డ్రెస్ ని డిజైన్ చేయించుకుంటున్నారు అంటూ వార్తలు వినపడుతున్నాయి. దీని విలువ లక్షల్లో ఉంటుందని చెబుతున్నారు. మరి చూద్దాం కృతి ఎటువంటి డ్రెస్ లో ఈ ఈవెంట్ కి రానుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: