సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు ఎక్కువగా చిన్న సినిమాలే వచ్చాయి. రెండు పెద్ద సినిమాల గైర్హాజరీ తో ఒక్క సారిగా ఈ చిన్న సినిమాలు ఈ సీజన్ ను ఉపయోగించుకోవాలి అనే కాన్సెప్టుతో విడుదల అయ్యాయి. వీటితో పాటు కొంత క్రేజ్ ఉన్న బంగార్రాజు చిత్రం కూడా విడుదల అయ్యింది. అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమాపై అక్కినేని అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకోగా దానికి తగ్గట్లుగానే ఈ చిత్రం సూపర్ హిట్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. 

అయితే సంక్రాంతి సందర్భంగా వచ్చే ప్రేక్షకులకు వినోదం అందించాలనే ఉద్దేశంతో మూడు చిన్న సినిమాలు కూడా బంగార్రాజు చిత్రం తో పాటు విడుదలయ్యాయి. అంతేకాదు వసూళ్లు కూడా గట్టిగా వస్తాయని భావించింది. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన సూపర్ మచ్చి సినిమాతో పాటు గల్లా అశోక్ కుమార్ మరియు ఆశిష్ రెడ్డి హీరోలుగా నటించిన హీరో మరియు రౌడీ బాయ్స్ అనే రెండు చిత్రాలు కూడా విడుదలయ్యాయి. ఆ విధంగా ఈ మూడు చిన్న సినిమాలు ప్రేక్షకులను అలరించాలని ప్రేక్షకుల ముందుకు రాగా ఆయా సినిమాలు వారు ఊహించిన రేంజ్ లో లేకపోవడం ఒక్కసారిగా సినిమా అందరినీ ఎంతగానో నిరాశపరిచింది.

అయితే ఈ సినిమాలు హిట్ కాకపోతే ఏంటి కలెక్షన్లు మాత్రం గట్టిగానే వస్తున్నాయ్ అని చిత్రబృందం చెబుతోంది. వాస్తవానికి ఈ సినిమా నిర్మాతలు ఊహించింది కూడా ఇదే. పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల సంక్రాంతి కి సినిమాలు చూడాలనే ఆశించే ప్రేక్షకులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వారికోసం ఏదో ఒక సినిమా తీసుకురావాలి కాబట్టి ఈ చిత్రాలన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు మేకర్స్. ఆ విధంగా వారు ఈ సినిమాలను విడుదల చేయగా వేరే పెద్ద సినిమాలు లేకపోవడంతో ఉన్న ఒక్క బంగార్రాజు సినిమా మళ్ళీ మళ్ళీ చూడలేక ఏదో ఒక సినిమా అన్నట్లుగా ఈ మూడు సినిమాలను ప్రేక్షకులు చూస్తున్నారు. అవి కొంత వరకు బాగానే ఉన్నాయి అనిపించడంతో వాటికి భారీ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. నిజంగా ఈ నిర్మాత ల స్ట్రాటజీ ను అందరూ మెచ్చుకోవాల్సిందే మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: