ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో స్టార్ హీరోలు విడాకుల బాట పడుతున్నారు. గతేడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత - నాగచైతన్య విడాకులు తీసుకోగా.. ఈ ఏడాది కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ - ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇప్పటికి అందరికి అర్ధం కానీ విషయం ఏంటంటే.. ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట ఎందుకు విడిపోవాల్సి వచ్చింది ? అన్నదానిపై రకరకాల చర్చలు వినిపిస్తున్నాయి.

అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యామిలీతో పాటు అటు ధనుష్ ఫ్యామిలీలో ఇప్పటికే చాలా విడాకులు జరిగాయి. ఇక సూపర్ స్టార్ రెండో కుమార్తె సౌందర్య ముందుగా అశ్వినీ రామ్‌కుమార్‌ను 2010లో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఓ బాబు పుట్టాక మనస్పర్థలు రావడంతో 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత సౌందర్య ఓ బిజినెస్‌మేన్‌తో ప్రేమలో పడి 2019లో అతడిని వివాహం చేసుకుంది.

కాగా.. ఇప్పుడు  రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య సైతం ధనుష్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. ఈ ధనుష్ - ఐశ్వర్యకి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఈ దంపతులకు వివాహం జరిగినప్పుడు ఐశ్వర్య వయస్సు 23 కాగా.. ధనుష్ వయస్సు 21 ఉంది. వారిద్దరి వయస్సులో వ్యత్యాసం ఉన్నపటికీ ఎంతమంది కామెంట్స్ చేసిన వీరిద్దరూ చాలా అన్యోన్యంగా జీవనం సాగిస్తూ అందరిచేత బెస్ట్ కపుల్ అనిపించుకున్నారు. ఇక వీరిద్దరూ విడాకుల ప్రకటన చేసి అందరికి షాక్ కి గురి చేశారు.

మరోవైపు  ధనుష్ అన్న సెల్వ రాఘవన్ ప్రముఖ దర్శకుడు తెలుగులో వచ్చిన 7 / జీ బృందావన్ కాలనీ, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలను తెరకెక్కించారు. అయితే సెల్వ రాఘవన్ 7 / జీ హీరోయిన్ సోనియా అగర్వాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ 2006లో పెళ్లి చేసుకుని 2010లో విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు అటు ధనుష్‌, ఇటు రజనీ ఫ్యామిలీలో వరుసగా విడాకులతో దాంపత్య జీవితాలు పెటాకులు అయ్యాయని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: