ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేటి రోజుల్లో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రభాస్ తో ఒక్క సినిమా చేస్తే చాలు అని అనుకోని దర్శకుడు లేడు.. ప్రభాస్ సినిమాలో ఛాన్స్ వస్తే బాగుండు అని అనుకోని హీరోయిన్ కూడా లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ ఉండడం గమనార్హం.


 అయితే ఎంత స్టార్ హీరో  అయినప్పటికీ ఒదిగి ఉంటూ ఎంతో సింప్లిసిటీ తో ప్రేక్షకుల మదిని దోచేస్తూ ఉంటాడు ప్రభాస్. ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తూ ఇక ప్రేక్షకులందరి చేత డార్లింగ్ అంటూ పిలిపించు కుంటున్నాడు.  ఇక వివాదాల జోలికి అయితే ప్రభాస్ అసలు పోడు అన్నది అభిమానులందరికీ తెలుసు. అయితే అలాంటి ప్రభాస్ కు ఏకంగా ఒక హీరోయిన్ తో వివాదం నడుస్తుంది అంటూ అప్పట్లో ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ప్రభాస్ తో వివాదాన్ని కొనసాగిస్తున్న హీరోయిన్ఎవరు అని అనుకుంటున్నారా. ఇంకెవరు హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ అటు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతోంది.



 ఇక టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ.. కానీ ఒక్కసారి కూడా ప్రభాస్ సినిమాలో నటించలేదు. అయితే ఒక స్టార్ డైరెక్టర్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలో ప్రభాస్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుందట రకుల్. కానీ ప్రభాస్ మాత్రం తన సరసన రకుల్ వద్దని వేరే హీరోయిన్ ను తీసుకోవాలని పట్టుబట్టాడటా. దీంతో డైరెక్టర్ చేసేదేమీలేక రకుల్ స్థానాన్ని వేరే హీరోయిన్ తో భర్తీ చేశాడట. దీంతో అప్పటి నుంచి రకుల్ ప్రభాస్ మధ్య చిన్నపాటి కోల్డ్ వార్ నడుస్తోంది అంటూ టాక్ ఉంది. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రం ఎవరికీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: