పాన్ ఆసియా సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల్లో మాత్రమే కాదు రియల్ లైఫ్ లో కూడా పెద్ద సూపర్ స్టార్ అని అంతా భావిస్తూ ఉంటారు.దానికి ప్రధాన కారణం ఆయన వ్యక్తిత్వం అని చెప్పాలి. బయట రజినీకాంత్ చాలా సింపుల్ గా ఉంటారు.ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా కాని కామన్ మ్యాన్ కంటే కూడా చాలా నేచురల్ గా ఉంటారాయన. ఇక ఆయన సామాజిక సేవల విషయానికి వస్తే ఎంతో మంది అనాథలను చేరదీశారు.అనారోగ్యంతో బాధపడుతున్న వారెంతో మందికి కూడా ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పించి ఎంతో మందిని ఆయన కాపాడారు.రజినీకాంత్ కి ఉన్న క్రేజ్ కు రాజీకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పార్టీ కనుక పెడితే.. అక్కడి రాజకీయాల్లో ఖచ్చితంగా ఎన్నో పెను మార్పులు సంభవించేవి. అయినప్పటికీ ఆయన అన్నీ తగ్గించుకొని కేవలం సినిమాలు చేసుకుంటూ తన జీవితాన్ని సంతోషంగా గడపాలని ఫిక్స్ అయ్యారు. ప్రొఫెషనల్ లైఫ్ లో రజినీ కాంత్ కి ఇప్పటి దాకా అసలు తిరుగు అనేదే లేదు. అయితే ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మాత్రం ఎన్నో ఒడుదుడుకులు ఉన్నాయి.ఆయన ఆరోగ్యం ఇప్పుడు అంతగా బాలేదు. దానికి తోడు ఇప్పుడు పెద్ద కూతురు ఐశ్వర్య కూడా హీరో ధనుష్ నుంచి విడాకులు తీసుకోబోతుంది.

ముందుగా రజినీకాంత్ చిన్న కూతురు సౌందర్య కూడా అప్పుడు అశ్విన్ రాజ్‌కుమార్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని ఓ బిడ్డకి కూడా జన్మనిచ్చింది.కానీ కొడుకు పుట్టిన ఏడాదికే వారు ఇలాగే విడాకులు తీసుకున్నారు. ఇక రెండు సంవత్సరాల తర్వాత విషగన్ వనంగముడి అనే నటుడిని ఆమె పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పుడు రజినీకాంత్ పెద్ద కూతురు ఇంకా హీరో ధనుష్ కూడా విడాకులకు సిద్ధమయ్యారు.పెళ్ళైన 18 సంవత్సరాలకి అది కూడా ఇద్దరు పిల్లలకి తల్లి అయిన తర్వాత ఇప్పుడు ఆమె విడాకులు తీసుకోబోతుండడం అనేది అందరినీ షాక్ కు గురి చేస్తుంది. అసలు రజినీకాంత్ కూతుర్లకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఆయనది ప్రేమ వివాహం అయ్యుండి కూడా రజిని జీవితం ఎంతో సాఫీగా సాగింది. అయితే కూతుర్ల విషయంలో మాత్రం రజినీ చేసిన తప్పేంటి? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలు ఎన్నో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.అయితే కూతుళ్ళ విషయంలో మాత్రం ఆ కారణాలు ఏంటి అంటే మిస్ అండర్ స్టాండింగ్ అనే చెప్పాలి. ఆయన కూతుళ్లు అల్లుళ్లకు మిస్ అండర్ స్టాండింగ్ ఇంకా అడ్జస్ట్ అయ్యే నేచర్ లేకపోవడం వల్లే వారి జీవితాలు విడాకులకు దారి తీశాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: