హీరోయిన్ సుహాసిని.. ఈమె ఎన్నో సినిమాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. సుహాసిని నటించే ఏ పాత్ర అయినా సరే ఆ పాత్రకు జీవం పోసినట్టు నటించడానికి ఆమెలో ప్రతిభ దాగి ఉంది అని ఇప్పటికే ఆమె అభిమానులు చెబుతూ ఉంటారు.. నిజం చెప్పాలంటే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎలా ఉందో ఆరు పదుల వయసు వచ్చినప్పుడు కూడా అంతే అందంగా ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.. ముఖ్యంగా ఎంతో మంది అమ్మాయిల జుట్టు మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. సుహాసిని అందం, నడుము కింది వరకు సాగిన జుట్టు అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి..

ఇకపోతే ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే సుహాసిని మణిరత్నం తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తాజాగా పోస్ట్ చేయడం జరిగింది.. ఇకపోతే సుహాసిని 60 సంవత్సరాలు కాలం గడిచిపోయినా ఇప్పటికీ ఒత్తయిన, దృఢమైన, పొడవైన జుట్టుతో కొన్ని ఫోటోలను షేర్ చేయగా వాటిని చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారు.. అంతేకాదు ఈమె తన జుట్టు పొడవుగా పెరగడానికి  ఏమి ఉపయోగిస్తోంది అని కూడా తెలుసుకోవడానికి ఆసక్తిగా అభిమానులు చూస్తున్నట్లు సమాచారం.


 ఇకపోతే ఈ చిత్రాలను చూసిన ఒక అభిమాని మీ జుట్టు రహస్యం ఏమిటో తెలుసుకోవాలని ఉంది మేడం అని ఆసక్తిగా అడిగాడు.. అయితే ఆమె తన అభిమాని కి సమాధానం కూడా ఇచ్చింది..సుహాసిని తన అభిమాని ప్రశ్నకు సమాధానంగా మనకు ఎలాంటి వెంట్రుకలు ఉన్నాయో అందులోనే ఆనందం వెతుక్కోవాలి అని ఆమె సమాధానం ఇచ్చింది. అంతేకాదు ఈ సమాధానంతో సంతృప్తి చెంది తనకు కృతజ్ఞతలు కూడా తెలిపాడు ఆ అభిమాని. ఇక తరుచూ జుట్టు గురించి జాగ్రత్తలు తీసుకుంటే ఏ వయసులో అయినా సరే పొడవైన జుట్టు సొంతమౌతుంది.. పోషకాహారం, జుట్టుకి హెన్నా మాస్కు వేయడం, సరిపడా నీళ్లు తాగడం, పండ్లు, పానీయాలు వంటి వాటివల్ల దృఢమైన జుట్టు సొంతం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: