సంగీతం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రమే లేదు. సంగీతంలో ఎవ‌రికీ వారే పోటీ ఉన్నారు. ముఖ్యంగా థ‌మ‌న్‌, మిక్కీజే మేయ‌ర్ లాంటి స్వ‌ర‌క‌ర్త‌లు పోటీ ఇస్తున్నా.. దేవీ శ్రీ ప్ర‌సాద్ మాత్రం త‌న పొజిష‌న్‌ను వ‌దులుకోవ‌డానికి సిద్ధ‌ముగా లేనే లేడు. అందుకు నిద‌ర్శ‌న‌మే ఇటీవ‌ల విడుద‌లై న అల్లుఅర్జున్‌-సుకుమార్ కాంబినేష‌న్‌లో పుష్ప సినిమానే. పుష్ప‌రాజ్ విజ‌యం సాధించ‌డంలో దేవీశ్రీ పాత్ర కీల‌కంగా ఉన్న‌ద‌నే చెప్ప‌వ‌చ్చు.

ముఖ్యంగా దేవి సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయి.. అప్ప‌టి నుంచి దేవీశ్రీ ప్ర‌సాద్‌గా పిలువ‌బడుతున్నారు. 1999లో దేవీ సినిమాతో కెరీర్ ప్రారంభించి.. ఇటీవ‌ల విడుద‌లైన పుష్ప సినిమా వ‌ర‌కు ఎన్నో సినిమాల‌కు సంగీతం అందించిన త‌న‌దైన శైలిలో ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచాడు. ఇక పాన్ ఇండియా సినిమాగా వ‌చ్చిన పుష్ప విజ‌యంలో దేవీశ్రీ పాత్ర కూడా కీల‌క‌మ‌నే చెప్పొచ్చు. ఈ చిత్రంలోని అన్ని పాట‌లు టాప్‌-100 యూట్యూబ్ గ్లోబ‌ల్ మ్యూజిక్ వీడియో చార్ట్‌లో చోటు ద‌క్కించుకున్నాయి.

అదేవిధంగా బాలీవుడ్‌హ బిగ్గీస్ క‌న్ను సూప‌ర్ టాలెంటెడ్ కంపోజ‌ర్‌పై ప‌డిన‌ది. గ‌తంలో దేవి కంపోజ్ చేసిన తెలుగు ట్యూన్‌ల‌ను బాలీవుడ్‌లో రీమెక్ చేసి హిట్‌నే కొట్టారు. అయితే డైరెక్ట‌ర్‌గా ఏ బాలీవుడ్ సినిమాకు దేవిశ్రీ సంగీత‌మును అందించ‌లేదు. పుష్ప ప్ర‌చారంలో ఇదే విష‌య‌ము ప్ర‌స్తావ‌న‌కొచ్చింది. త‌ను సినిమాకు సోలోగా పాట‌ల‌నందించడానికి ఇష్ట‌ప‌డ‌తాన‌ని చెప్పాడు దేవి.

ఇదిలా ఉండ‌గా.. దేవీశ్రీ నిరీక్ష‌ణ ఫ‌లించే రోజు ద‌గ్గ‌ర ప‌డిన‌ట్టే తెలుస్తోంది. టీ సిరీస్ అధినేత భూష‌ణ్ కుమార్‌తో డీఎస్పీ మీటయ్యాడు. వీరి మీటింగ్‌లో త్వ‌ర‌లో టీ సిరిస్ నిర్మించే సినిమాకు దేవిశ్రీ సంగీతం అందించ‌డానికి సూత్ర‌ప్రాయంగా అంగీక‌రించిన‌ట్టు స‌మాచారం. బాలీవుడ్ మేక‌ర్స్ పాట‌ల‌కు, బ్యాక్ గ్రౌండ్ స్కోరు కు వేర్వేరు సంగీత ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేయించుకోవ‌డం ఆన‌వాయితీగా చేసారు. ఈ విష‌యంపై దేవీశ్రీతో పాటు థ‌మ‌న్ కూడా త‌మ అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కారు. టీసిరీస్ సినిమాకు దేవీశ్రీ పాట‌ల వ‌ర‌కే ప‌రిమిత‌మ‌వుతాడా..? లేక సంగీతాన్ని కూడా అందిస్తాడా అనేది చూడాలి మ‌రీ.

మరింత సమాచారం తెలుసుకోండి: