బాలయ్య బాబు ఆహా కోసం చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి తన ఫుల్ ఎఫర్ట్ పెట్టేస్తున్నారు. సరదాగా అనుకుని మొదలు పెట్టిన ఈ అన్ స్టాపబుల్ షో సంచలనాలను సృష్టిస్తుంది. నందమూరి ఫ్యాన్స్ తో పాటుగా సినీ ప్రేక్షకులందరిన్ని బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ షో అలరిస్తుంది. ఈ షోలో బాలకృష్ణ ఎనర్జీని చూసి అందరు అవాక్కవుతున్నారు. తొలి సారి వెండితెరని దాటి రికార్డుల వేట కొనసాగిస్తున్నారు బాలయ్య బాబు.

ఇక షోలో సెలబ్రిటీస్ తో మాట్లాడే విధానం కానీ.. బాలయ్య చూపిస్తున్న సెన్సాఫ్ హ్యూమర్ కానీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రతి ఎపిసోడ్ తో బాలయ్య చిల్ అవడం చూసి ఆడియెన్స్ థ్రిల్ అవుతున్నారు. ఇక లేటెస్ట్ గా మంగళవారం మెను తో ఆహా అన్ స్టాపబుల్ ప్రోమో తో అదరగొట్టారు నందమూరి హీరో. తన మంగళవారం డైట్ ఏంటన్నది రివీల్ చేస్తూ తన దగ్గర పనిచేసే పర్సనల్ చెఫ్ కి కాల్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అంతేకాదు లంచ్ కి వస్తున్నా మంగళవారం కాబట్టి ఆలుగడ్డ చేయమన్నారు.. దాన్ని ఎలా చేయాలో కూడా చెప్పారు బాలయ్య. ఆ తర్వాత మళ్లీ దాన్న్ని వద్దని చెప్పి దొండకాయ ఫ్రై చెయమని చెప్పి దానికి యాడెడ్ ఫ్లేవర్ గా కాలిఫ్లవర్ ని కూడా ప్రిపేర్ చేయమన్నారు.

అవే కాదు వాము రసం.. కొమ్మరి చట్నీ కూడా వండమన్నారు. ఇలా తన చెఫ్ తో సరదాగా బాలయ్య మాట్లాడిన వీడియో అన్ స్టాపబుల్ షో ద్వారా ఆహాలో అప్లోడ్ చేశారు. బ్రేక్ ఫాస్ట్ గా జీడిపప్పుతో కలిసి చేసిన ఉప్మా ఇంకా ఊతప్ప తిన్నానని బాలయ్య చెప్పారు. మొత్తానికి బాలయ్య గురించి ఇలాంటి విషయాలు ఈ షో ద్వారా ఆయనంతట ఆయనే బయట పెట్టడం ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: