సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో విడుదలైన పుష్ప సినిమా ఎంత సెన్సేషనల్  విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదట్లో కాస్త నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ వసూళ్లలో మాత్రం అదరగొట్టింది. అయితే పుష్ప సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ఇక ఈ సినిమాలో సమంత నటించిన ఐటెం సాంగ్ అంతకుమించిన విజయాన్ని సాధించింది అనే చెప్పాలి. మొదట ఈ ఐటమ్ సాంగ్ వింటేనే ప్రేక్షకులందరికీ కిక్ ఎక్కింది. ఇక ఈ సినిమాలో హాట్బ్యూటీ సమంత నటించే సరికి ప్రేక్షకులకు మత్తులో తేలియాడారు అని చెప్పాలి. కోర చూపులతో సమంత ఐటమ్ సాంగ్ లో డాన్స్ చేస్తూ కుర్రకారు అందరికీ పిచ్చెక్కించింది. దీంతో సినిమా కంటే సమంత ఐటమ్ సాంగ్ మరింత హిట్ అయింది అని చెప్పాలి.



 ప్రస్తుతం ఎక్కడ చూసినా సమంత ఐటమ్ సాంగ్ వినిపిస్తుంది. చిన్న నుంచి పెద్దల వరకు అందరూ సమంత ఐటమ్ సాంగ్ పై డాన్స్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి. ఇలా ఇటీవల కాలంలో సమంత నటించిన ఐటెం సాంగ్ మాత్రం అన్ని భాషలలో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎన్నో రికార్డులు సృష్టిస్తోంది. అయితే కేవలం భారత దేశంలో మాత్రమే కాదు అటు పుష్పా ఊ అంటావా ఉహూ అంటావా ఐటమ్ సాంగ్ క్రేజ్ ఖండాంతరాలు దాటింది అన్నది ఇక ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇటీవలె మనదేశంలో కాదు ఏకంగా ఆఫ్రికాదేశంలో సమంత ఊ అంటావా మావా అనే పాట పై పాట పై డాన్స్ చేసి అదరగొట్టాడు ఒక వ్యక్తి.



 దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. టాంజానియా దేశం సోషల్ మీడియా స్టార్ కిలిపాల్ ఊ అంటావా ఉహూ అంటావా అనే పాట పై తనదైన శైలిలో స్టెప్పులు వేసి అద్దరగొట్టిండు. ఇక ఈ స్టెప్పులు చూసినవారు వావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఇక ఈ వీడియో వీక్షించిన తర్వాత లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే కిలిపాల్ పుష్ప సినిమాలోని సామి పాటకు డాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. అంతే కాకుండా త్రిబుల్ ఆర్ సినిమా లోని నాటు  నాటు పాటపై కూడా డాన్స్ చేశాడు.  ఇక ఇప్పుడు సమంత ఊ అంటావా మావా పాటపై కూడా డాన్స్ చేసి అదరగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: