త‌మిళ ద‌ర్శ‌కుడు సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 7 జీ బృందావ‌నం సినిమా 2004 అక్టోబ‌ర్ 15 న విడుద‌లైంది. ఇక ఆ సినిమా గురించి ప్ర‌త్యేకంగా చెప్పన‌క్క‌రే లేదు. హీరో ర‌వికృష్ణ‌, సోనియా అగ‌ర్వాల్ అద్భుతంగా న‌టించారు. ఈ చిత్రంలో ర‌వికృష్ణ ర‌విగా.. సోనియా అనిత‌గా న‌టించారు. వీరిద్ద‌రి మ‌ధ్య రొమాన్స్‌సీన్స్ అద్భుతంగా పండించారు ద‌ర్శ‌కుడు. ఇందులో ముఖ్యంగా ఒక సాంగ్ కోస‌మే చాలా మంది కుర్రాల్లు మ‌ళ్లీ మ‌ళ్లీ సినిమాను వీక్షించారు. ఆ సాంగ్ జ‌ర‌గ‌డానికంటే ముందు.. కొంచెం సంభాష‌ణ జ‌రిగింది. అదేమిటో చూసిన త‌రువాత‌.. సాంగ్ వ‌స్తుంటుంది.

 ముఖ్యంగా  చెప్పు అనిత ఏమి డిసైడ్ చేసావో చెప్పు అని అడ‌గ‌గా.. ప్లీజ్ ర‌వి రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం అని అంటుంది హీరోయిన్‌. కాసేపు అయినా నీతో ప్ర‌శాతంగా ఉండాలంటుంది. రేప‌టి వ‌ర‌కు స‌మ‌యం ఉంది. బాగా ఆలోచించి చెప్పు. కేవ‌లం ఇలాగైనా పిలుచుకోవ‌చ్చు. అయ్యో అనిత అని మాట్లాడుతుండ‌గానే షాక్‌కు గుర‌వుతాడు.. అయ్యో అయ్యో అనిత ఏమిటిది.. నా ముందే ఇలా చేస్తున్నావు అని ప్ర‌శ్నిస్తాడు ర‌వి.

ఏ ఏమిటి త‌ప్పు.. నీ ముందే క‌దా బ‌ట్టలు మార్చుకుంటున్నాను. అయితే త‌ప్పేముంది. ఆ త‌రువాత ర‌వి నువ్వు ఇక్క‌డే ప‌డుకో.. నేను బాల్కానీలో ప‌డుకుంటాను అని.. నాకు అదోలా ఉంద‌ని వెళ్లిపోతాడు. నీకు నీమీద న‌మ్మ‌కం ఉంటే.. ఒకే మంచం మీద కూడా ధైర్యంగా ప‌డుకోవ‌చ్చు. న‌మ్మ‌కం ఉంది.. కానీ నిద్ర‌లో కాలో, చేయో వేయ‌రాని చోట వేస్తే.. అన‌గా.. హీరోయిన్ వేస్తే ఏముంది.. అంటుంది. అప్పుడు హీరో ర‌వి నేను కంట్రోల్ చేసుకోలేను అనిత అంటాడు. ఏదైనా జ‌ర‌గ‌రానిది జ‌రిగిపోతుంది. జ‌ర‌గ‌నీయి.. జ‌రిగితే ఏమిటంటా.. మ‌న‌స్సే ఇచ్చాను. న‌న్ను ఇచ్చుకోనా ఏమిటి. అనిత ఆశ్చ‌ర్యంగా ర‌వి పిల‌వ‌డంతో.. ఏమిటి నేను ఇలా మాట్లాడుతున్నాన‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నావా..? ఎందుకో తెలియ‌డం లేదు. రెండు రోజుల నుంచి నా మ‌న‌స్సు స‌రిగ్గా లేదు ర‌వి. దేనిని చూసినా భ‌యంగా ఉంది. అన్నింటిని వ‌దిలేసి.. ఎక్క‌డికైనా దూరంగా వెళ్లిపోవాల‌నిపిస్తుంది.

కానీ నాకు తెలుసు.. నేను చేస్తున్న‌దంతా త‌ప్పేన‌ని, ఇలా ఒంటరిగా రావ‌డం.. నీతో ఒకే రూమ్‌లో ఉండ‌టం.. అన్నీ.. నా వ‌ల్ల కంట్రోల్ కావ‌డం లేదు. న‌న్ను ఏదో శ‌క్తి లాగుతోంది. నా మ‌న‌స్సు ఎటో ప‌రుగులు తీస్తుంది ర‌వి అంటూ సాగిన సంభాష‌ణ ఇది. ముఖ్యంగా సిగ్గు విడిచి చెబుతున్నాను. ఈ నిమిషం నీకు భార్య‌గా ఉండాలని ఆశ ప‌డుతున్నాను. రియ‌ల్ వైఫ్‌. మ‌న‌స్పూర్తిగా మ‌న‌స్సుతో, శ‌రీరంతోనూ అని పేర్కొంటుంది. ఇంత కాలం నువ్వు మాత్ర‌మే ఇలా ఫీల్ అవుతున్నావు. ఇప్పుడు తొలిసారి నేను కూడా ఫీల్ అవుతున్నాను అని పేర్కొంటుంది అనిత‌. ఇక ర‌వి అనిత ఏదేదో మాట్లాడుతున్నావు. నువ్వేనా మాట్లాడేది.. ఊరికే త‌గిలితేనే మండిప‌డుతావు. అలాంటిది నువ్వు ఇలా అని ఆశ్చ‌ర్య‌పోతాడు. అందుక‌ని ల‌వ్ చేయ‌గానే లొంగిపోతారా అని ప్ర‌శ్నిస్తుంది అనిత‌..?

ఇంత‌కు ముందు నీ మీద న‌మ్మ‌కం క‌లుగ‌లేదు. ఇప్పుడు నా ర‌వి ఏమి చెప్పినా వింటాడు. ఉద్యోగం చేస్తున్నాడు. సంపాదిస్తున్నాడు. రేపు ఏదైనా స‌మ‌స్య వ‌చ్చినా కూడా న‌న్ను కాపాడుతాడు. ఇంత‌క‌న్నా ఏమి కావాలి. నిన్ను కాద‌ని మావాళ్లు వేరే వాళ్ల‌కు ఇచ్చి పెళ్లి చేస్తే.. ఎట్‌లీస్ట్ నీకు ఈ సంతోషం అన్నా ఉంటుంది అని పేర్కొంటుంది అనిత‌. నీకు ఇష్టం లేక‌పోతే వెళ్లు.. లేక‌పోతే..! ఏదో నేను బ‌తిమిలాడిన‌ట్టుంద‌ని పేర్కొంటుంది. ఇక అప్పుడు సాగే రొమాన్స్ సాంగ్‌.. జ‌న‌వ‌రి మాసం.. అరే మంచు కురిసే స‌మ‌యం అనే సాంగ్ అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఈ పాట ద్వారా రొమాన్స్ సీన్ల‌ను అద్భుతంగా పండించారనే చెప్ప‌వ‌చ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: