ఇన్నాళ్లు హోమ్లీ గా గ్లామర్ షో విషయంలో చాలా షరతులు పెట్టిన మళయాళ భామ అనుపమ ఆ క్రేజ్ తోనే తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. మొన్నటిదాకా బొద్దుగా ఉన్న ఈ అమ్మడు ఈమధ్య డైటింగ్ లు గట్రా చేసి బక్కచిక్కింది. స్లిం గా మారడమే కాదు తన ఆలోచనలని మార్చుకుంది అనుపమ. గ్లామర్ విషయంలో ఇన్నాళ్లు ఒకలా ఆలోచించించిన అనుపమ ఒక్క సినిమాతో తన అడ్డు గోడలన్ని బద్ధలు కొట్టేసింది. దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ తెరకెక్కించిన రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ ఆడియెన్స్ అందరి మైండ్ బ్లాక్ చేస్తూ రెచ్చిపోయింది.

చేతిలో పెద్దగా సినిమాలు లేవు.. తెలుగులో స్టార్ క్రేజ్ దక్కించుకోవాలన్న ఆశ నెరవేరట్లేదు. ఈ క్రమంలో దిల్ రాజు ఇచ్చిన ఆఫర్ ఆమెని టెంప్ట్ చేసింది. తన ఫ్యామిలీ హీరో కోసం అనుపమ లాంటి క్లాస్ హీరోయిన్ ని రొమాంటిక్ యాంగిల్ లోకి మార్చేశాడు దిల్ రాజు. అందుకోసం ఆమెకి అర కోటి దాకా రెమ్యునరేషన్ ఇచ్చాడని టాక్. సినిమా కథ చెప్పినప్పుడే ఆమె సీన్స్, లిప్ లాక్స్ గురించి చెప్పారట. రౌడీ బాయ్స్ సినిమా చూసిన ఆడియీన్స్ అనుపమ ఈ రేంజ్ లో రెచ్చిపోవడం చూసి ముక్కున వేలేసుకున్నారు. ఇచ్చిన రెమ్యునరేషన్ కోసమా.. ఆడియెన్స్ కి తనని తాను కొత్తగా ప్రెజెన్స్ చేసుకోవాలనే ప్రయత్నమా అన్నది తెలియదు కానీ అనుపమ మాత్రం రౌడీ బాయ్స్ కోసం గీత దాడేసింది.

ఆమెకి ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ చాలా పద్ధతిగా ఉండటం వల్ల ఆమె చేసిన ఈ రొమాంటిక్ సీన్స్ చూసి కొందరు ఆడియెన్స్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అయితే రౌడీ బాయ్స్ కోసం అయితే రెమ్యునరేషన్ కోసం అలా చేఏసింది. మరి రాబోయే సినిమాల్లో కూడా అనుపమ ఇలానే రెచ్చిపోతుందా.. తన ఇమేజ్ ని పూర్తిగా మార్చేసుకునే ప్రయత్నంలో అనుపమ తన సత్తా చాటనుందా అన్నది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: