అయితే కొన్నాళ్లపాటు వీరు విడాకులు తీసుకుంటున్నారు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఇలాంటి వార్తలు చూసినప్పుడు సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడం ఏంటి.. ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేశారు అందరు. కాని ఆ తర్వాత నిజంగానే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. ఒకరిపట్ల ఒకరు ఎంతో ప్రేమాభిమానాలు చూపించే వీరిద్దరి మధ్య విడాకులు తీసుకునే అంతా పెద్ద సమస్య ఏం వచ్చింది అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే విడాకుల తర్వాత ఎవరి కెరియర్లో వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు. నాగచైతన్య వరుస సినిమాలు చేస్తూ ఉండగా అటు సమంత కూడా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతుంది.
అయితే సమంత పెళ్లి అవ్వకముందు విడాకులపై చేసిన ఒక పోస్టు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.. వివాహం చేసుకుంటాను, విడాకులు తీసుకుంటాను అంటూ గతంలోనే సమంత సోషల్ మీడియాలో చెప్పినట్లు తెలుస్తోంది.. 2013లో సమంత సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ తో చాట్ చేసింది. ఈ సందర్భంగా అలా నేటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ నేను పెళ్లి చేసుకుంటాను విడాకులు కూడా తీసుకుంటాను చూస్తూ ఉండండి మీతో డ్యాన్స్ కూడా చేస్తాను అంటూ రిప్లై ఇచ్చింది సమంత. అయితే సమంత అప్పట్లో ఇది ఏ ఉద్దేశ్యంతో అన్నదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఈ పోస్ట్ కాస్తా వైరల్ గా మారిపోయింది. మరి ఇది నిజమేనా లేదా ఎవరైనా ఇలా క్రియేట్ చేసి వైరల్ గా మార్చారా అన్న చర్చ కూడా నడుస్తోంది.