ఒకప్పుడు ఏదైనా సినిమాలో మితిమీరిన శృంగార సన్నివేశాలు ఉన్నాయి అంటే అబ్బో అది బూతు సినిమా అని అనుకునేవారు ప్రేక్షకులు. కానీ ఇటీవలి కాలంలో  సినిమాలో బోల్డ్ సన్నివేశాలు లేకపోతే సినిమా ఏంటి ఇలా ఉంది.. దర్శకుడు కాస్త రొమాంటిక్ టచ్ యాడ్ చేసి ఉంటే బాగుండేది అని ఫీల్ అవుతున్నారు ప్రేక్షకులు. నేటి రోజుల్లో పంథా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో వినూత్నమైన కాన్సెప్ట్ తో వస్తున్న ఎన్నో సినిమాల్లో బోల్డ్ సీన్స్ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇలా రొమాంటిక్ సీన్స్ తో ప్రేక్షకులందరినీ ఆశ్చర్యపరిచి మత్తెక్కించిన సినిమా ఆర్ఎక్స్ 100.


 ఈ సినిమాలో అప్పటి వరకు చెప్పుకోదగ్గ నటులు ఎవరూ లేరు. అందరూ సినిమా ఇండస్ట్రీకి కొత్త వారే. కానీ సినిమా మాత్రం అందరికీ ఊహించని రేంజ్ లో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆర్ ఎక్స్ 100 ని డిఫరెంట్ టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాల్లో ఉండే రొటీన్ లవ్ స్టోరీ  కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది. కాని ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులందరినీ కూడా అవాక్కయ్యేలా చేస్తాయ్. వామ్మో ఈ రేంజిలో రొమాంటిక్ సన్నివేశాలు ఏంటి అంటూ సినిమా  చూస్తున్న ప్రేక్షకుడు అవాక్కవుతు ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా ఫ్యామిలీతో చూడటం చాలా కష్టమనే చెప్పాలి.



 ఇలాంటి రొమాంటిక్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు అజయ్ భూపతి ఏకంగా రొమాన్స్ అనే కాన్సెప్ట్లో పీహెచ్డీ చేశాడేమో అని అనిపిస్తూ ఉంటుంది ఈ సినిమా చూసిన తరువాత. కొత్తగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నప్పటికీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. హీరో  కార్తికేయ మాత్రం పాత్రలో ఒదిగిపోయారు. అన్ని సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో రొమాన్స్ కాస్త నాటు గానే ఉంటుంది. ఎందుకంటే బాడీ బిల్డర్ లా కనిపించే హీరోపై హీరోయిన్ మోజు పడుతుంది. ఏలాగైనా అతనితో సుఖపడాలి అనుకుంటుంది. కానీ మొహానికి ప్రేమ అనే రంగు పూసుకుని నటించడం మొదలు పెడుతుంది. అంతా ఎంజాయ్ చేసిన తర్వాత విలన్ గా అవతారమెత్తి హీరో ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తోంది. ఇలా ఈ సినిమా స్టోరీ మాత్రమే కాదు ఈ సినిమాలోని రొమాన్స్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులకు కాస్త కొత్తదనాన్ని పరిచయం చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: