ఒకప్పుడు సినిమా లో రొమాన్స్ అంటే కేవలం  చూపులతో మాత్రమే చేసే వారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం రొమాన్స్ అంటే రెచ్చిపోతున్నారు. నాలుగు గదుల మధ్య చేసుకునే రొమాన్స్ మొత్తాన్ని కెమెరా ముందు చూపించేస్తున్నారు. ప్రేక్షకులంతా పంథా కూడా మారిపోయింది. సినిమాల్లో ఇలాంటి సీన్లు లేవు అంటే కాస్త హర్ట్ అయిపోతున్నారు. అందుకేనేమో దర్శక నిర్మాతలు కూడా సినిమాల్లో అవసరం లేకపోయినప్పటికీ రొమాన్స్ కు మాత్రం ఎక్కువగా దట్టిస్తూ ప్రేక్షకులను మత్తెక్కిస్తున్న పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ఇటీవల కాలంలో ఎన్నో రొమాంటిక్ సినిమాలు టాలీవుడ్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.



 అయితే నేటి రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలను చూసి రొమాన్స్ అంటే ముద్దు పెట్టుకోవడం.. హగ్ చేసుకోవడం లేదా పడకగదిలో ఇంకేదో చేసేయడం అని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు. కాని రొమాన్స్ అంటే శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా అంటూ రొమాన్స్ కి కొత్త అర్ధం చెప్పింది ఓ సినిమా. అందరిలో లో కొత్త ఆలోచనను తీసుకువచ్చింది. రొమాన్స్ అంటే పడక గదిలో చేసేది మాత్రమే కాదు మన భాగస్వామితో మాట్లాడే ప్రతి మాట రొమాన్స్ కిందికే వస్తుంది చెప్పింది ఆ సినిమా. ఆ సినిమా ఏదో కాదు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా.



 భార్యతో భర్త తో మాట్లాడే ప్రతి మాట లో రొమాన్స్ ఉంటుందని.. రొమాన్స్ పడక గదిలో చేసేది మాత్రమే కాదు అంటూ రొమాన్స్ కి కొత్త అర్థాన్ని  చెప్పాడు అక్కినేని హీరో అఖిల్. ఇక ఈ సినిమా యూత్ అందరికీ ఎంతగానో బాగా కనెక్ట్ అయిపోయింది అని చెప్పాలి. ఇక అప్పటి వరకు రొమాన్స్ అంటే తమలో ఉన్న భావనను కొట్టిపారేసి.. ప్రతిక్షణం రొమాన్స్ ఆహ్వానించడం మొదలు పెట్టారు ప్రేక్షకులు. ఇలా ఇటీవలికాలంలో మితిమీరిన బోల్డ్ సన్నివేశాలతో ఇదే రొమాన్స్ అంటూ ప్రేక్షకులను  నమ్మిస్తున్న వేళ అసలు రొమాన్స్ కు అర్థం చెప్పి అందరిని ఆలోచింప చేశాడు అక్కినేని హీరో అఖిల్. ఇక అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కథ అంత బాగుంది కాబట్టి అఖిల్ కి మొదటి విజయం దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: