ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మెగా హీరో 25 లక్షల రూపాయల అత్యంత ఖరీదైన డైమండ్ రింగ్ తీసుకొని, ఒక హీరోయిన్ తో తన ప్రేమ గురించి వెల్లడించడానికి బెంగళూరు కి బయల్దేరాడు అని సమాచారం.. నిజం చెప్పాలంటే మెగా ఫ్యామిలీ లో పెళ్లి కానీ హీరోలు కేవలం ముగ్గురు.. నలుగురు మాత్రమే ఉన్నారు.వారిలో ముందు వరుసలో ఉన్న వాడు మెగా హీరో వరుణ్ తేజ్ అని చెప్పవచ్చు. నేడు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ గాసిప్ ఒక్కసారిగా గుప్పుమంది. ఇక వరుణ్ తేజ్ అనగానే ఇప్పటికీ ఆ హీరోయిన్ ఎవరో చాలా మందికి అర్థం అయ్యే వుండి ఉంటుంది.

నిజమే.. మీరు అనుకుంటున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు లావణ్య  త్రిపాఠి.. గతంలో కూడా లావణ్య త్రిపాటి ..  వరుణ్ తేజ్ ప్రేమ లో ఉన్నారు అని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని..అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారని.. ఇలా రకరకాలుగా వీరిద్దరిపై రోజుకో తరుణంలో వార్తలు  పుట్టుకొచ్చాయి. అయితే వీటిపై ఇద్దరూ కూడా సైలెంట్ గా ఉండిపోవడంతో ఈ వార్తలు కాస్త నిజమేనని భావించిన ప్రేక్షకులు కూడా లేకపోలేదు. ఇకపోతే లావణ్య త్రిపాటి, వరుణ్ తేజ్ సోదరి నిహారిక కు చాలా బెస్ట్ ఫ్రెండ్ అని అందరికీ తెలిసిన విషయమే.

మెగా ఫ్యామిలీలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా..నిహారిక తరఫున లావణ్య త్రిపాటి ఆ వేడుకలకు హాజరు అవుతూ ఉండేది.. కానీ చూసిన ప్రతి ఒక్కరూ వరుణ్ తేజ్  కోసం మాత్రమే లావణ్య త్రిపాటి మెగా వారి ఫోన్ పట్టిందని సమాచారం.. మొన్నటివరకు సద్దుమణిగిన ఈ వ్యవహారం తాజాగా ఈ రోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా మళ్లీ వెలుగులోకి రావడంతో నిజమేనని నమ్ముతున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మొత్తానికి అయితే వరుణ్ తేజ్ ప్రేమ లో ఉన్నాడనే వార్త బాగా వినిపిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: