బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతూ మంచి ఫాంలో వున్న మెగా హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'గని'. బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను చాలా ఫాస్ట్ గా జరుపుకుంటోంది. ఇప్పటికే గని సినిమా నుంచి 'గని ఫస్ట్ పంచ్', 'గని యాంథెమ్', ఇంకా మిల్కీ బ్యూటీ తమన్నా ఐటెం సాంగ్ ను విడుదల చేశారు. ఇవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి ట్రెండ్ కూడా అయ్యాయి.ఇక  ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్బంగా కానుకగా.. ఈ సినిమా నుంచి చిన్న టీజర్ ని చిత్ర బృందం వారు వదిలారు. అందులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని ఎంతో పవర్ ఫుల్ గా చూపించారు. ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అయిన సునీల్ శెట్టి నటిస్తున్నాడు. ఈ సినిమాలో సునీల్ శెట్టి వరుణ్ తేజ్ కి ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా కనిపించారు. 

ఇక టీజర్ విషయానికి వస్తే కొంతమంది యోధులుగా తయారవుతారు కానీ 'గని' యోధుడిగా పుట్టాడు అంటూ క్యాప్షన్ ఇచ్చి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.ఇక ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ యంగ్ అండ్ హాట్ బ్యూటీ సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే ఉపేంద్ర, జగపతిబాబు ఇంకా యువ హీరో నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ-సిద్దు ముద్ద సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.యస్ యస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఇప్పటికే విడుదల చెయ్యాల్సింది కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ సినిమా వాయిదా పడుతోంది. 


  https://twitter.com/GA2Official/status/1483677697415192579?t=S8guGc7uVvOB0lq0ghFmzQ&s=19

మరింత సమాచారం తెలుసుకోండి: