బాక్సాఫీసు వ‌ద్ద అటు అఖండ కానీ ఇటు బంగార్రాజు కానీ ఎవ‌రికి వారే అన్న విధంగా ఉన్నారు.యాభై రోజులు పూర్తయి అఖండ మంచి టాక్ తోనే చాలా చోట్ల న‌డుస్తోంది.ముఖ్య‌మయిన కేంద్రాల‌లో యాభై రోజుల పండుగ నిర్వ‌హించి బాల‌య్య కు కానుక ఇవ్వాల‌ని ఆశిస్తున్నారు అభిమానులు.అంత‌గా ఈ సినిమా మంచి వ‌సూళ్లు సాధించింది.విదేశాల్లో అయితే అసలు ఓ ప్ర‌భంజ‌న‌మే సృష్టించి త‌న స‌త్తాను హ‌వాను చాటుకుంది.ఈ నేప‌థ్యంలో బంగార్రాజు వ‌చ్చి అఖండ‌ను అడ్డుకుంటుంది అని అంతా అనుకున్నా అవేవీ జ‌ర‌గ‌ని ప‌నులు అని తేలిపోయాయి.

బాల‌య్య రికార్డుల‌ను ఆప‌డం కానీ బ్రేక్ చేయ‌డం కానీ జ‌ర‌గ‌ని ప‌ని అని  కూడా నిర్థార‌ణ అయిపోయింది.సోగ్గాడికి ఇప్ప‌టికి వ‌చ్చిన న‌ష్టం అయితే లేదు. షో టైమింగ్స్ మార్చుకుని మ‌రీ కొన్ని ఊళ్ల‌లో నాలుగు షోలు వేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు కూడా అవుతున్నాయి.నైట్ క‌ర్ఫ్యూ ప్ర‌భావం కార‌ణంగా ఇలాంటి మార్పులు చేర్పులు కొన్ని చేసి సినిమాను న‌డిపేందుకు  విజ‌య తీరాల‌కు చేర్చేందుకు నాగ్ టీం చేస్తున్న కృషి మంచి ఫ‌లితాలే ఇస్తుంది.కానీ అఖండ రేంజ్ లో ఈ సినిమా మానియాను కొనసాగించ‌డం మాత్రం క‌ష్టం అనే తేలిపోయింది.


పండ‌గకు పండ‌గ‌లాంటి సినిమా అని సంద‌డి చేసిన బంగార్రాజు మూవీ ఆశించిన విధంగా ఓవ‌ర్సీస్ లో క‌లెక్ష‌న్లు ద‌క్కించుకోలేక‌పోయింది.కానీ తెలుగు రాష్ట్రాల‌లో మాత్రం బాగానే క‌లెక్ష‌న్లు ఉన్నాయి అని తెలుస్తోంది. సినిమా విడుద‌లయిన మూడు రోజుల‌కే యాభై కోట్ల రూపాయ‌ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసింద‌ని చిత్ర నిర్మాణ వ‌ర్గాలు చెప్పి, అభిమానుల‌ను,సినిమా ప్రేమికుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి.ఇదే స‌మ‌యంలో మూవీ ప్ర‌మోష‌న్ యాక్టివిటీస్ కూడా బాగుండ‌డంతో ఇంకొద్ది రోజులు ఆగితే సినిమా క‌లెక్ష‌న్ రిజ‌ల్ట్ మ‌రింత బెట‌ర్ అయ్యే అవ‌కాశం ఉంది అని కూడా తెలుస్తోంది.ఎన్ని చేసినా కూడా ఈ సినిమా ఓవ‌ర్సీస్ రిజ‌ల్ట్ మాత్రం పెద్ద‌గా లేదు.
ఆ మాట‌కు వ‌స్తే అఖండ సినిమాను భారీగా ఆదుకున్న‌ది ఓవ‌ర్సీస్ క‌లెక్ష‌న్ డేటానే! ఆ విధంగా చూసుకుంటే నాగ్ క‌న్నా బాల‌య్య ఎన్నో రెట్లు విజ‌యం సాధించారు అని కూడా చెప్ప‌వ‌చ్చు. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సినిమాను మ‌రింతగా ప్ర‌మోట్ చేసుకున్నా కూడా అఖండ‌ను దాటి బంగార్రాజు వ‌సూళ్ల సునామీ సృష్టించ‌డం సాధ్యం కాని ప‌ని అని కూడా తేలిపోయింది.
 

విదేశాల్లో అఖండ కలెక్ష‌న్ల డేటా చూస్తే ...

- యుఎస్ఏలో 1.25 మిలియ‌న్ డాల‌ర్లు (ఇండియ‌న్ క‌రెన్సీలో దాదాపు 9 కోట్లు)
- మలేసియా,సింగ‌పూర్ ల‌లో దాదాపు 7.25 కోట్లు
- ఆస్ట్రేలియా,న్యూజిలాండ్..ల‌లో దాదాపు 12 కోట్లు (ఇప్ప‌టికీ అక్క‌డ 17 సెంట‌ర్ల‌లో సినిమా ప్ర‌ద‌ర్శితం అవుతోంది)
- యూర‌ప్ లో దాదాపు ప‌ది కోట్లు (ఎనిమిది మేజ‌ర్ థియేటర‌ల్లో ఇప్ప‌టికీ ప్ర‌ద‌ర్శితం అవుతోంది)
 



మరింత సమాచారం తెలుసుకోండి: