యువ సామ్రాట్ హీరో నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా సక్సెస్ తర్వాత మరొక విజయాన్ని బంగార్రాజు సినిమా రూపంలో అందుకున్నారు. నాగార్జున - నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగచైతన్య, తన తండ్రికి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు. అవి ఏంటో ఒక్కసారి చూద్దామా.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒక్కరిగా చలామణి అవుతున్న వారిలో అక్కినేని నాగార్జున ఒక్కరు అని చెప్పాలి. ఆయన ఇండస్ట్రీలో నవమన్మధుడుగా గుర్తింపు తెచ్చుకొని.. మాస్ ఆడియన్స్ ను, ఫ్యామిలీ ఆడియన్స్ ను, అమ్మాయిలను కూడా తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ పరంగా నాగార్జున, నాగచైతన్యతో కలిసి టాలీవుడ్ మీడియాతో పాటు బాలీవుడ్ మీడియాకి కూడా ఇంటర్వ్యూలు ఇచ్చిన సంగతి అందరికి తెల్సిందే.

ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య నాగార్జునకు సంబంధించిన కొన్ని విశేషాలను తెలిపారు. ఇక  అక్కినేని నాగార్జునకు కోపం రావాలంటే ఏం చేయాలి..? అనే ప్రశ్న ఎదురుగా.. నాగచైతన్య మాట్లాడుతూ.. నాన్నకు అనుకున్న ప్లాన్ ప్రకారం అన్ని సవ్యంగా జరగాలి.. చివరి నిమిషంలో ప్లాన్ మార్చితే మాత్రం ఆయనకు బాగా కోపం వస్తుందని వెల్లడించారు. అంతేకాదు.. నాగార్జునకు కోపం పోవాలి అంటే ఏం చేయాలి..? అని అడగగా నాగచైతన్య స్పందిస్తూ..నాన్నకు మంచి ఫుడ్ అంటే చాలా ఇష్టమని.. ఇక ముఖ్యంగా మన ఇండియన్ స్పైసీ ఫుడ్ లో ఆయనకు బిర్యానీ అంటే బాగా ఇష్టం అని చెప్పారు.

ఇక నాగార్జునకి ఎప్పుడు బిర్యానీ తినాలనిపించిన తినాలనిపించినా ఆవిడ దగ్గర నుంచి తెప్పించుకొని తింటారు అని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. ఇక బాలీవుడ్ ఇంటర్వ్యూలో నాగచైతన్య తన తండ్రికి సంబంధించిన కొన్ని రహస్యాలను కూడా చెప్పుకొచ్చాడు. నాగార్జున ఇష్టంగా తినే బిర్యాని వండి పెట్టే ఆ మహిళ ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చారు..? అనే విషయాలు తెలుసుకోవడానికి ఆయన అభిమానులు అరా తీయడం మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: