ఇటీవల కాలంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాతగా ఉన్న సురేష్ బాబు థియేటర్ వ్యవస్థపై ప్రస్తుతం ఉన్న టికెట్ విధానాల పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డి.రామానాయుడు తనయుడిగా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలను నిర్మించాడు సురేష్ బాబు. ఇప్పుడు కూడా మంచి మంచి సినిమాలు తీస్తూ నిర్మాతగా కొన సాగుతూ ఉండగా గత కొంతకాలంగా మారుతున్న పరిస్థితులను గమనించిన ఆయన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 

ఇకపై తను నిర్మించే సినిమాలను ఓటీటీ లలో మాత్రమే విడుదల చేస్తానని చెప్పి అందరినీ ఒక్క సారిగా ఆశ్చర్యపరిచాడు సురేష్ బాబు. టాలీవుడ్ సినిమా పరిశ్రమలోనే అగ్ర నిర్మాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల అందరూ ఎంతగానో దిగ్భ్రాంతి కి లోనయ్యారు. పెద్ద నిర్మాతలే ఈ విధంగా ఆలోచిస్తే చిన్న నిర్మాతల పరిస్థితి ఏంటి అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేశారు.  ఆ విధంగా సురేష్ బాబు చెప్పినట్లుగానే ఆయన నిర్మిస్తున్న ప్రతి సినిమా కూడా ఓ టీ టీ లోనే విడుదల చేస్తున్నాడు. 

వెంకటేష్ హీరోగా నటించిన గత రెండు సినిమాలు ఓ టీ టీ లోనే విడుదల చేశాడు సురేష్ బాబు. నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాగా దృశ్యం2 సినిమా హాట్ స్టార్ లో విడుదల అయింది. ఎలాంటి టెన్షన్ లేకుండా తమ సినిమాలను సాఫీగా ప్రేక్షకులు చూడాలని భావంతో ఆయన ఈ విధంగా చేస్తున్నారని చెబుతుండడం విశేషం.  తాజాగా ఆయన తనయుడు దగ్గుబాటి రానా హీరోగా నటించిన విరాటపర్వం సినిమా కూడా ఓ టీ టీ లో విడుదల చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ సంస్థతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో పూర్తయినా కూడా ఇప్పటిదాకా విడుదల చేయకుండా ఉంచారు. మరి ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: