ప్రస్తుతం ఎవరి నోట విన్న హీరోయిన్ కృతి శెట్టి పేరే వినబడుతుంది. ఆమె భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుని ఎంతగానో అలరిస్తుంది. ఆమె ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ లో ఆమెకు బాగానే డిమాండ్ ఏర్పడింది అని చెప్పవచ్చు. తాజాగా ఆమె హీరోయిన్గా నటించిన బంగార్రాజు చిత్రం కూడా సూపర్ హిట్ కావడంతో అందరూ ఆమెను గోల్డెన్ లెగ్ గా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను హీరోయిన్ గా పెట్టుకునేందుకు పెద్ద హీరోలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఇక బంగార్రాజు చిత్రం హిట్ సెలబ్రేషన్స్ లో జోరుగా పాల్గొంటున్న ఈ ముద్దుగుమ్మ తను భవిష్యత్తులో చేయబోయే సినిమాల గురించి చెబుతుంది. ఏ హీరో తో నటించాలని ఉంది అన్న ప్రశ్నకు రామ్ చరణ్ తో నటించాలని ఉంది అనే సమాధానం చెప్పి అందరినీ ఒక్క సారిగా ఆశ్చర్యపరిచింది అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ ఆమె ఇంట్రెస్ట్ గ్రహించి ఆమెకు ఛాన్స్ ఇచ్చే విధంగా ఆలోచన చేస్తున్నట్లు గా ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా ఈమెనే పెట్టుకునే విధంగా ఆలోచన చేస్తున్నడట రామ్ చరణ్. ఇదే కనుక నిజమైతే కృతి శెట్టి నిజంగా నక్కతోక తొక్కిన వచ్చిందనే చెప్పాలి. ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇంత తక్కువ సమయంలో నే పెద్ద హీరోతో నటించే ఛాన్స్ రావడం నిజంగా ఆమె చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పెద్ద హీరోయిన్లకు ఎవరికీ దక్కని విధంగా ఈ అవకాశం ఈమెకు ఈ ఆపర్చునిటీ దక్కడం ఆమెకు ఎంతటి స్థాయిని పెంచుతుందో చూడాలి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న రామ్ చరణ్ తొందర్లోనే ప్రశాంత్ నీల్ సినిమా ను మొదలు పెట్టనున్నాడు. 



 

మరింత సమాచారం తెలుసుకోండి: