ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ హిట్ ను అందించి బాక్స్ ఆఫీస్ ను ఒక కుదుపు కుదిపి వసూళ్ల సునామీ తెప్పించిన చిత్రం "అర్జున్ రెడ్డి". అప్పట్లో ఈ చిత్రానికి వచ్చిన హైప్ మరే సినిమాకి రాలేదు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మనసులో ప్రేమ లేనప్పుడు ఫీలింగ్ రాదనే కాన్సెప్ట్ యువతకు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ చిత్రంలో హీరోయిన్ షాలిని పాండే కి విజయ దేవరకొండకి మధ్య నడిచిన రొమాన్స్ అండ్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమాకి సంబందించిన టీజర్, ట్రైలర్ లతో భారీ అంచనాలు ఏర్పడగా విడుదల అనంతరం ఈ చిత్రం అంచనాలకు మించిన విజయాన్ని అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ల మధ్య  లవ్ లివ్ ఇన్ రిలేషన్ షిప్ సినిమాకి  కీలకంగా మారింది. కోపం కంట్రోల్ చేసుకోలేని సన్నివేశాల్లో, రొమాంటిక్ సీన్స్ లో, ఎమోషనల్ సన్నివేశాల్లో, సెంటిమెంటల్ సీన్లు దేనికదే హైలెట్ గా చేశాడు హీరో విజయ దేవరకొండ. ముఖ్యంగా  రొమాంటిక్ సీన్స్ లో ఈ హీరో ఎమోషన్ తో కూడిన యాక్షన్ ప్రేక్షకులను అబ్బురపరిచింది. అప్పట్లోనే విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా ఎదుగుతాడు అని అంతా ఊహించారు. అందరూ అనుకున్న విధంగానే నేడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు విజయ్ దేవరకొండ.

కొత్త రకమైన రొమాన్స్ కు శ్రీకారం చుట్టిన అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక మార్గదర్శిగా నిలిచాడు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మొదట్లో ఈ రొమాన్స్ ను కుటుంబ ప్రేక్షకులు వ్యతిరేకించినా ఆ తర్వాత యువత ఈ సినిమాకు బ్రహ్మరధం పట్టారు. ఈ సినిమా తర్వాత కొన్ని చిన్న సినిమాలు కేవలం రొమాన్స్ మీద ఆధారపడి తెరకెక్కి హిట్ కొట్టిన దాఖలాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: