టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో చాలామంది హీరోయిన్లు సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫ్యాన్స్ అనే సంగతి తెలిసిందే. సినిమాసినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబుకు క్రేజ్ పెరుగుతుందే తప్ప అసలు తగ్గడం లేదు.సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తున్న సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా మహేష్ బాబు ఫ్యూచర్ ప్రాజెక్టులు స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కుతుండటం గమనార్హం. బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి కూడా మహేష్ బాబుకు పెద్ద వీరాభిమాని కావడం గమనార్హం.సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి సినిమాలో దివి చిన్న రోల్ లో కనిపించింది. తాజాగా దివి మహర్షి సినిమా షూటింగ్ అనుభవాల గురించి మాట్లాడుతూ మహేష్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. మహేష్ బాబును చూసి తాను సిగ్గుపడిపోయానని దివి తెలిపింది. మహర్షి సినిమా దివికి మొదటి సినిమా కాగా సెట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా అందంగా కనిపించారని దివి చెప్పింది.

తొలి సినిమాలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో పని చేశానని దివి కామెంట్లు చేసింది.అమ్మాయిలందరం కూడా ఒకవైపు కూర్చుని ఉన్నామని సూపర్ స్టార్ మహేష్ బాబు మా ముందునుంచి వెళ్లగా ఎంత బాగున్నాడో అని అనుకున్నామని దివి వెల్లడించింది. నాకు తెలియకుండానే సూపర్ స్టార్ మహేష్ తో బాండింగ్ ఏర్పడిందని కెరీర్ మహేష్ సినిమాతో మొదలైంది కాబట్టి తనకు ఆ ఫీలింగ్ కలిగిందని దివి వెల్లడించింది. సూపర్ మహేష్ బాబు హెయిర్ స్టైల్ కానీ స్కిన్ టోన్ కానీ మరో లెవెల్ లో ఉంటాయని దివి తెలిపింది.ఇక మహర్షి సినిమాలో తాను ఐదు సీన్లలో నటించానని అయితే ఆ సీన్లలో చాలా సీన్లు ఎడిటింగ్ లో కట్ చేశారని దివి కామెంట్లు చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక ఫ్రేమ్ లో కనిపించినా ఒక బిట్ లో కనిపించినా చాలని దివి వెల్లడించింది. మహేష్ గురించి దివి చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ 4 షో ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న దివికి తెలుగు సినిమాలలో చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఆఫర్లు వస్తున్నాయి. బిగ్ బాస్ షో దివి కెరీర్ కు బాగానే ఉపయోగపడిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: