'బుజ్జిగాడు' సినిమాతో పేరు సంపాదించిన నటి సంజన గల్రాని చెల్లెలు నిక్కీ గల్రాని కోలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. చూడ్డానికి తన అక్కలాగా ఎంతో హాట్ గా వుండే నిక్కీ తన నటన ఇంకా క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. ఇక ఈ హాట్ బ్యూటీకి వరుస అవకాశాలు కూడా క్యూ కట్టాయి.ఇక ఇదిలా ఉండగా.. జనవరి 11 వ తేదీన నిక్కీ తన దగ్గర పనిచేసే 19 ఏళ్ల ఓ కుర్రాడు ధనుష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నై రాయపేటలోని నిక్కీ గల్రాని ఇంట్లో అతడు పని చేస్తున్నాడు. అయితే నిక్కీకి చెందిన ఖరీదైన బట్టలు ఇంకా కెమెరా కనిపించలేదు. ఇక ఈ సంఘటన తరువాత ధనుష్ పరారీలో ఉండడంతో అతడే దొంగతనం చేసినట్లుగా భావించి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.ధనుష్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ధనుష్ తిరుపూర్ లోని తన స్నేహితుడి ఇంట్లో దాక్కున్నట్లుగా గుర్తించారు.

సోమవారం నాడు తిరుపూర్ లో అతడిని అరెస్ట్ చేసి.. దొంగతనం చేసిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విచారణ కోసం ధనుష్ ని చెన్నైకి కూడా తీసుకొచ్చారు పోలీసులు.ఇక అతడి దగ్గర స్వాధీనం చేసుకున్న వస్తువులను నిక్కీకి పోలీసులు అప్పగించారు. దీంతో నిక్కీ తన కంప్లైంట్ ను విత్ డ్రా చేసుకున్నట్లు సమాచారం తెలుస్తుంది. ధనుష్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా పోలీసులను కోరిందట నిక్కీ గల్రాని. ధనుష్ దొంగతనం చేసిన వస్తువులు లక్షకు పైగా ఖరీదు చేస్తాయని సమాచారం తెలుస్తుంది.'డార్లింగ్‌', 'వెలయిన్ను వందుట్టా వెల్లైక్కారన్‌', 'కడవుల్ ఇరుక్కన్‌ కుమారు', 'మొట్ట శివ కెట్ట శివ', 'హరహర మహాదేవకి' ఇంకా అలాగే 'మరగత నానయం' వంటి తమిళ సినిమాలతో మంచి పాపులారిటీ దక్కించుకుంది.తెలుగులో 'మరకతమని' సినిమాతో ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. కాని తమిళంలో వచ్చిన అవకాశాలు అయితే ఈమెకు రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: