స్టార్ హీరో అయిన బాలకృష్ణ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని చాలామంది అభిమానులు కూడా భావిస్తారు. అయితే బాలయ్య శైలి మరియు తన శైలి డిఫరెంట్ కావడంతో తమ కాంబినేషన్ లో సినిమా రాదని వర్మ గతంలోనే తెలిపారట.

బాలయ్య వర్మ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే ఆ సినిమా ఎలా ఉంటుందో చెబుతూ బుల్లితెరపై కొన్ని స్కిట్లు కూడా ప్రసారమయ్యాయనే విషయం అందరికి తెలిసిందే.

మరోవైపు బాలయ్య అన్ స్టాపబుల్ షోను విజయవంతంగా హోస్ట్ చేస్తున్నారట.. ఈ షో సక్సెస్ కావడంతో ఈ షోకు హాజరైన గెస్టులు సైతం వార్తల్లో నిలుస్తున్నారని తెలుస్తుంది.త్వరలో అన్ స్టాపబుల్ సీజన్1 ముగియనుందని సమాచారం.. అయితే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ షోకు రావాలని ఎంతో ఆశ పడుతున్నారు. అన్ స్టాపబుల్ షో అదిరిందని వర్మ చెప్పుకొచ్చారట ఈ షో అంతరిక్షం స్థాయికి వెళ్లిందని వర్మ కామెంట్లు కూడా చేశారు.

బాలయ్యగారు తనకు కూడా ఒక ఛాన్స్ ఇస్తారని ఆశిస్తున్నానని వర్మ అన్నారట.మరి బాలయ్య వర్మ త్వరలో ఒకే వేదికపై సందడి చేస్తారేమో చూడాలి మరి.రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన పూరీ జగన్నాథ్ తాజాగా లైగర్ చితృబృందంతో కలిసి అన్ స్టాపబుల్ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే. బాలయ్య ఆర్జీవీని ఇంటర్వ్యూ చేస్తే వర్మ స్ట్రెయిట్ గా సమాధానాలు చెబుతారా? లేక తలతిక్కగా సమాధానాలు చెబుతారా? చూడాలో మరి.

బాలయ్య వర్మ మధ్య ఎలాంటి గొడవలు లేకపోయినా కూడా వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా బాలయ్యకు ఇష్టం లేకుండా తెరకెక్కిందట.బాలయ్య ఈ షోకు వర్మను ఆహ్వానించే అవకాశం అయితే అస్సలు లేదని అభిమానులు భావిస్తున్నారని తెలుస్తుంది . బాలయ్య, వర్మ ప్రస్తుతం వేర్వేరుగా ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు.ఇప్పటికే బాలయ్య నటించిన అఖండ భారీ విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: