అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం పుష్ప. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. సోషల్ మీడియాలో కుడా ఈ సినిమా రికార్డ్ లను సొంతం చేసుకుంది. అయితే పాన్ ఇండియా సినిమాగా విడుదల అయిన ఈ సినిమా వచ్చి నెల అయిన క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. సినిమాకు ఇప్పటికీ అదే స్పందన లభిస్తుంది.. ఈ సినిమా పై ఇప్పటికే మంచి కామెడీ సింబల్స్ వస్తున్నాయి. మొత్తానికి బన్నీ ఖాతాలో భారీ హిట్ పడింది.


పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులు చాలా మంది సినిమా బాగుందని చెప్పగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అల్లు అర్జున్ పుష్ప క్రేజ్ ను వాడుకుంటోంది.. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుతం దేశ వ్యాప్థంగా కరొన మహమ్మారి విలయ నృత్యం చెస్తుంది. రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతూన్నాయి. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ లోని ప్రముఖులు కరోనా తో పోరాడి చనిపొయారు. అంత జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రజలకు తమ స్తైల్లొ చెప్థూ వస్తున్న వాళ్ళే కోవిడ్ బారిన పడుతుంటే సాదారన ప్రజలు భయం తో వణికిపోతూన్నారు.


ఇది ఇలా ఉండగా.. పుష్ప క్రేజ్ ను అందరూ బాగా వాడుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు మరీ ఎక్కువగా వాడారు. పుష్ప పోస్టర్ ను ఉపయోగించి, హెల్మెట్ లను ధరించాలని విజ్ఞప్తి చేశారు. అది ఇటీవల సోషల్ మీడియాలో మొన్నటి వరకూ చక్కర్లు కొట్టింది. తర్వాత డ్రంక్‌ అండ్ డ్రైవ్ కేసులను తగ్గించడానికి కూడా పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా సరికొత్త ఆలోచన చేసింది. వైరస్ మీద ప్రజల్లో అవగాహన కలిగించేందుకు అధికారులు వివిధ మార్గాలను అనుసరిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినిస్టరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ డిపార్ట్‌మెంట్ ఈ ఆలొచనకు తెర తీసింది. ఇలా ఒక్కొక్కటి వస్తూ పుష్ప సినిమా గురించి వస్తుంటే బన్నీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: