తెలుగు సినిమాలలో ఉండే హీరోలు ఎంతో మంది ఈ మధ్యకాలంలో సిక్స్ ప్యాక్ లుక్ కోసం చాలా కష్టపడుతున్నారు.. ప్రతి ఒక్కరూ ఇలా చేయడంతో ఇది కాస్త ట్రెండీగా మారిపోయింది.. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ కూడా ఈ సిక్స్ ప్యాక్ లుక్ కోసమే చాలా ఆత్రుత పడుతూ ఉంటారు. ప్రస్తుతం హీరోలు సైతం ఈ మేకోవర్ తో షాక్ ఇస్తూ ఉంటారు.. అలా చాక్లెట్ బాయ్ గా పేరు పొందిన రామ్ పోతినేని సైతం.. ఇస్మార్ట్ శంకర్ సినిమా కోసం.. సరికొత్తలుక్ ను మార్చుకోవడం జరిగింది. ఇక అందులో చాలా రఫ్ గా కనిపించే సిక్స్ ప్యాక్..తో అందర్నీ మైమరిపించారు.

ఇక అంతే కాకుండా చివరిగా సిక్స్ ప్యాక్ ని చూపిస్తూ చేసే సన్నివేశంలో కూడా రామ్ అద్భుతంగా నటించాడు అని చెప్పవచ్చు. అయితే ఈసారి కూడా తన సినిమా కోసం మరొక సారి ఈ సిక్స్ ప్యాక్ ను ట్రై చేయబోతున్నాడట. తమిళ డైరెక్టర్లలో ఒకరైన లింగుస్వామితో కలిసి.. ది వారియర్ మూవీను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా కొద్దిరోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించి.. టైటిల్ పోస్టర్ ను విడుదల చేయగా.. అందులో రామ్ పోతినేని ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. ఫస్ట్ టైం హీరో రామ్ ఒక పోలీస్ పాత్రలో కనిపిస్తుండడంతో ఆయన అభిమానులు కూడా చాలా సంతోషిస్తున్నారు.ఇక డైరెక్టర్ లింగుస్వామి, రామ్ పోతినేని కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.. అంతేకాకుండా హీరో రామ్ ఈ సినిమాలోని పాత్ర కోసం చాలా కష్టపడ్డాడట. రెడ్ సినిమాలో కాస్త బరువు పెరిగినప్పటికీ.. ది వారియర్ మూవీ కోసం దాదాపుగా నాలుగు మాసాలపాటు తన ఫిజిక్ ను మార్చేందుకు కష్టపడ్డాడట తన టోటల్ బాడీ అంత పర్ఫెక్ట్ సేఫ్ కోసం చాలా కష్ట పడినట్లు సమాచారం. ఇందులో కథనాయకిగా కృతి శెట్టి నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: