అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కి డిసెంబర్ 17వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా ఎంత మంచి విజయం సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అంతకుమించిన విజయాన్ని అందుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాదు అటు బాలీవుడ్ లో కూడా 100 కోట్ల వరకు వసూలు రాబట్టి సత్తా చాటింది పుష్ప సినిమా. పుష్ప సినిమా విడుదలై చాలా రోజులు గడిచిపోతున్నాయి కానీ ఇంకా పుష్ప మేనియా మాత్రం తగ్గడం లేదు. ఎక్కడ చూసినా పుష్ప సినిమాకు సంబంధించి ఏదో ఒకటి దర్శనమిస్తూనే ఉంది. ముఖ్యంగా పుష్ప సినిమాలో ఊ అంటావా ఉహూ అంటావా అనే పాట ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది.


 ప్రతి ఒక్కరు ఈ పాట పై డాన్స్ చేయడం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇక మరికొంతమంది పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం ఫాలో అవుతూ అదిరిపోయే డైలాగులు చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల జబర్దస్త్ కమెడియన్స్ సైతం పుష్ప స్పూఫ్ చేయడం మొదలుపెట్టారు. ఇటీవలే జబర్దస్త్ కార్యక్రమం లో భాగంగా హైపర్ ఆది పుష్ప సినిమాకి స్పూఫ్ చేశారు. ఈ స్పూఫ్ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమవుతుంది. అయితే మేము ఏమైనా తక్కువ అనుకున్నారో ఏమో సుడిగాలి సుదీర్ టీం కూడా పుష్ప సినిమాకు స్పూఫ్ చేశారు.


 ఈ క్రమంలోనే బుల్లితెరపై సూపర్ స్టార్ గా కొనసాగుతున్న సుడిగాలి సుదీర్ పుష్ప గెటప్ లో జబర్దస్త్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇస్తాడు. ఇక ఆ తర్వాత బన్వర్ సింగ్ షెకావత్  పాత్రలో గెటప్ శీను ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడు కేశవ పాత్రలో అటు ఆటో రాంప్రసాద్ ఎంట్రీ ఇస్తాడు. ఇటీవలే విడుదలైన ప్రోమో లో భాగంగా ఏకంగా పుష్ప గెటప్ లో సుడిగాలి సుధీర్ ని చూసి అభిమానులు అందరూ మురిసిపోతున్నారు. మా సుధీర్ అన్న  తోపు ఏ గెటప్ వేసిన ఇట్టే ఒదిగిపోతాడు అంటూ కామెంట్లు కూడా పెడుతూ ఉండడం గమనార్హం. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ప్రోమో పై ఒక లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: