ధనుష్, ఐశ్వర్యా రజినీకాంత్ డైవర్స్ తర్వాత మరోసారి స్టార్ హీరోయిన్ డైవర్స్ తో ధనుష్ కి లింక్ పెడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు డైరక్టర్ ఏ.ఎల్ విజయ్ ఫాదర్ ఏ.ఎల్ అగప్పన్. తమిళంలో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న అమలా పాల్ తో ఏ.ఎల్ విజయ్ ప్రేమించి పెళ్లాడాడు. పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే కండీషన్ మీదనే అమలా పాల్, విజయ్ ఒక్కటయ్యారు. కానీ వారి వైవాహిక జీవితం రెండేళ్లకే డైవర్స్ కు దారి తీసింది. అయితే అమలా పాల్ డైవర్స్ వెనక ఓ స్టార్ హీరో ఉన్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఏ.ఎల్ విజయ్ ఫాదర్ ఫిల్మ్ మేకర్ అగప్పన్ తమ తనయుడు డైవర్స్ తీసుకోవడానికి కారణం ధనుష్ అని డైరెక్ట్ గా చెప్పారు. అమలా పాల్ తో అతను సినిమాల్లో నటించాలని చెప్పడం వల్లే ఆమె పెళ్లి తర్వాత సినిమాలు చేయాలని అనుకున్నదని. వారి డైవర్స్ కి అతనే కారణమని అప్పట్లో అన్నారు. ఇప్పుడు మళ్లీ ధనుష్, ఐశ్వర్యల డైవర్స్ ఎనౌన్స్ మెంట్ తర్వాత మరోసారి అదే మ్యాటర్ లో ధనుష్ పై ఎటాక్ చేశారు ఏ.ఎల్ విజయ్ ఫాదర్ అలగప్పన్.

అమలా పాల్ తన కొడుకు తో విడాకుల వెనక ధనుష్ ఉన్నాడని అన్నారు. ధనుష్ ఐశ్వర్యల డైవర్స్ వెనక చాలా రీజన్స్ ఉన్నట్టే అనిపిస్తుంది. సుచీ లీక్స్ దగ్గర నుండి వీరి మధ్య దూరం పెరిగిందని.. అదే కొనసాగుతూ వచ్చిందని.. ఇన్నాళ్లకు వారు సెపరేట్ అవుదామని నిర్ణయించుకున్నారని అంటున్నారు. ధనుష్, అమలా పాల్ పై కూడా రకరకాల వార్తలు కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ధనుష్ విడాకుల తర్వాత ఈ వార్తలు మరింత పెరిగాయి. నేషనల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న ధనుష్ ఇలా ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడతాడని ఎవరూ ఊహించి ఉండరు.


మరింత సమాచారం తెలుసుకోండి: