తెలుగు ఓటీటీ ఆహా తెలుగు ఆడియెన్స్ కి కంప్లీట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. సినిమాలు, వెబ్ సీరీస్ లతో పాటుగా ఆహా ఒర్జినల్ మూవీస్ టాక్ షోస్ తో ఆహా అదరగొట్టేస్తుంది. రీజనల్ ఓటీటీ గా ఆహా చాలా మంచి రెస్పాన్స్.. ఓ రేంజ్ లో సక్సెస్ అయిందని చెప్పొచ్చు. రీసెంట్ గా బాలయ్య బాబుతో క్రేజీగా చేస్తున్న అన్ స్టాపబుల్ షోతో మరింత పాపులారిటీ వచ్చింది. అన్ స్టాపబుల్ షో ఓటీటీ టాక్ షోల్లో సంథింగ్ స్పెషల్ అనిపించేలా రికార్డులు కొడుతుంది.

ఇక ఇదిలాఉంటే ఆహా కోసం అడపాదడపా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని వాడేస్తున్నారు ఆహా టీం. పుష్ప ద్వారా నేషనల్ క్రేజ్ తెచ్చుకున్న మన బన్నీతో ఆహా టీం ఓ సరికొత్త టాక్ షో ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఆహా కోసం అల్లు అర్జున్ ఎప్పుడంటే అప్పుడు రెడీ అన్నట్టు ఉంటాడు. ఇప్పటికే ఎన్.టి.ఆర్ బిగ్ బాస్ హోస్ట్ గా.. ఎవరు మీలో కోటీశ్వరుడు హోస్ట్ గా కూడా చేసి మెప్పించాడు. అందుకే అల్లు అర్జున్ నెక్స్ట్ టార్గెట్ ఎన్.టి.ఆర్ లానే హోస్ట్ గా కూడా మెప్పించాలని ప్రయత్నిస్తున్నాడు. స్టార్ హీరోగా మెగా, అల్లు ఫ్యాన్స్ మనసులు గెలుచుకున్న బన్నీ ఇక ఇప్పుడు బుల్లితెర మీద తన సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడు.

అల్లు అర్జున్ తో టాక్ షో ఖచ్చితంగా ఆహా టీం ఆహా అనిపించేలా ప్లాన్ చేస్తుందట. ప్రస్తుతం దీనికి సంబందించిన వర్క్ జరుగుతుందని తెలుస్తుంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఆహా కోసం బన్నీ ఈ టాక్ షో తో మరింత పాపులర్ అవ్వాలని చూస్తున్నారు. స్టార్ హీరోలంతా సినిమాలతో పాటుగా స్మాల్ స్క్రీన్ పై కనిపించి ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యారు. ఆ తరహాలోనే అల్లు అర్జున్ కూడా ఆహా కోసం ఓ సరికొత్త షోకి హోస్ట్ గా మారుతున్నాడని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: