‘ఆర్ ఆర్ ఆర్’ మళ్ళీ వాయిదా పడటంతో ఈమూవీని ఎప్పుడు విడుదల చేయాలి అన్న చర్చలు రాజమౌళి కాంపౌండ్ లో జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా థర్డ్ వేవ్ మార్చి మధ్యలో పూర్తిగా కంట్రోల్ కు వస్తుంది అన్న అంచనాలు వస్తూ ఉండటంతో మళ్ళీ భారీ సినిమాల విడుదల డేట్స్ పై చర్చలు మొదలయ్యాయి.


అందరికంటే ముందుగా చిరంజీవి ‘ఆచార్య’ ఏప్రియల్ 1న విడుదల తేది ఫిక్స్ చేసుకోవడంతో ఏప్రియల్ నుండి భారీ సినిమాల క్యూ మొదలవుతుంది అన్న సంకేతాలు వస్తున్నాయి. దీనితో అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే మే మొదటి వారంలో ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల ఉండవచ్చు అన్న సంకేతాలు వస్తున్నాయి.


ఇప్పటికే ఈ మూవీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం అంటూ అంచనాలు వస్తున్న పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ స్థాయిలో ఒక భారీ సినిమాను తీసే ఆలోచనలు బోయపాటి ఆలోచనలు చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. ఫిలిం ఇండస్ట్రీ వర్గాలలో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ మూవీకి ‘బి బి బి’ అనే వర్కింగ్ టైటిల్ ను కూడ బోయపాటి ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది.


‘అఖండ’ మూవీ సూపర్ సక్సస్ తో బోయపాటి ఆలోచనలలో ఒక భారీ మల్టీ స్టారర్ ఉన్నట్లు టాక్. పాన్ ఇండియా మూవీగా నిర్మాణం జరుపుకునే ఈ భారీ సినిమాలలో బాలకృష్ణ అల్లు అర్జున్ ల కాంబినేషన్ సెట్ చేయడానికి బోయపాటి ఒక పవర్ ఫుల్ కథను ఆలోచిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం బోయపాటితో మరొక సినిమాను చేయడానికి అటు బన్నీ ఇటు బాలయ్య కూడ ఆశక్తి కనపరుస్తూ ఉండటంతో వీరిద్దరిని కలిపి ఈ భారీ మల్టీ స్టారర్ తీయాలి అన్న బోయపాటి ఆలోచనలు సక్సస్ అయితే అది ‘ఆర్ ఆర్ ఆర్’ స్థాయిలో ఉంటుందని అంచనాలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: